November

మరోమారు మాట తప్పిన ప్రభుత్వం..

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వ మరోసారి మాట తప్పింది. వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో పొలాలున్న రైతులకు కోరిన రెవెన్యూలో ఒకేచోట స్థలం కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం అటువంటిదేమీ లేదని ప్రకటించింది. కుటుంబంలో ఒకే గ్రామ పరిధిలో వేర్వేరు పేర్ల మీద ప్లాట్లు ఇచ్చిన యజమానులు ఒకే చోట భూములు కావాలనుకుంటే ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. జనవరి రెండోతేదీన నేలపాడులో పూలింగు ప్రక్రియ ప్రారంభించారు. అప్పట్లో వేర్వేరు రెవెన్యూ గ్రామాల్లో భూములున్న రైతులు తమకు ఒకేచోట భూములు కావాలని కోరారు. దీనికి మంత్రులు అంగీకరించారు.

కార్పొరేట్ల కోసమే భూబ్యాంకు: వెంకటేశ్వర్లు

బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ల కోసమే ప్రభుత్వం భూ బ్యాంకు పేరిట భూములను బలవంతంగా సేకరిస్తోందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అన్నారు. కడప జిల్లా బద్వేలు నియోజక వర్గంలో భూబ్యాంక్‌ కింద 36 వేల ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూముల్ని తీసుకున్న గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఒక్క కడప జిల్లాలోనే భూ బ్యాంకు కోసం 1.23 లక్షల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందన్నారు. ఈ విధానాన్ని రైతులు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

UGC ముట్టడి ఎందుకు...?

ఆక్యుపై యుజిసి అనేది... ఢిల్లీ విద్యార్థి లోకం ఎత్తుకున్న ప్రధాన నినాదం. ఢిల్లీలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో నేడు యుజిసి ముట్టడి అనేది ఒక పెద్ద ఉద్యమంగా తయారయింది. దేశంలో గత రెండు దశాబ్దాలుగా వేగవంతమైన నయా ఉదారవాద విధానాల ఫలితంగా అన్ని రంగాలూ స్వరనాశనమయ్యాయి. అన్ని రంగాల్లో ప్రయివేట్‌ ఆధిపత్యం పెరిగింది. అందులో మరీ ముఖ్యంగా విద్య, వైద్యం అంగడి సరుకైనాయి. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ప్రయివేటు అనుకూల విధానాల ఫలితంగా ఉన్నత విద్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షలా మారింది.

ఛార్జీల బండ..

ముఖ్యమంత్రిగా కాక మాంచి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా మన్ననలందుకోవాలని తాపత్రయ పడుతున్న చంద్రబాబు ఏలుబడిలో ప్రజల పరిస్థితి చెంప దెబ్బ గోడ దెబ్బ అన్నట్లు తయారైంది. అమరావతి శిలాన్యాస్‌ సంరంభంలో ప్రత్యేక హోదాపై స్పష్టత రాక నిరాశ చెందిన ప్రజలు తమ నెత్తిన పడేందుకు వరుస కట్టిన సర్కారీ ఛార్జీల బండలపై మరింతగా కలత చెందుతున్నారు. రాజధాని శంకుస్థాపన మరుసటి రోజే ఆర్టీసి బస్‌ ఛార్జీలు బాది ప్రయాణీకుల తల బొప్పి కట్టించగా, అతి త్వరలోనే ట్రూ అప్‌ పేరుతో వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చేందుకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది.

ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 'పార్టీ రాజకీయాలు' ముదురుతున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి హోదా సాధనకు నిరవధిక దీక్షకు దిగడం, దానిని టిడిపి ప్రభుత్వం భగం చేయడంతో రాష్ట్రంలో 'ప్రత్యేక' రాజకీయం వేడెక్కింది. ఈ పోరులో మరో ఇద్దరు బలయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనని ఇప్పటికే కొందరు ప్రాణత్యాగం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుండడంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని పార్టీలు ఇలా రెచ్చగొట్టే వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. పౌరజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.

బిజెపికి చెంపపెట్టు..

దేశంలో అధిక ధరలు, ఉపాధి హామీకి కరువు, కనీసవేతనాలు వంటి అనేక సమస్యలతో సామాన్యుడు సతమతమవుతుంటే అవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలో, మత చిచ్చు రేపడంలో మునిగి తేలుతున్న బిజెపికి యుపి, మహారాష్ట్ర ప్రజలు మున్పిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక. యుపి స్థానిక ఎన్నికలు గ్రామీణ ప్రజల నాడిని తెలియజేస్తుండగా, మహారాష్ట్ర మున్సిపల్‌ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజల మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బిజెపికి ఎదురైన ఘోర పరాజయం చిన్నదేమీ కాదు. అందులోనూ ఆయన దత్తత తీసుకున్న జయపూర్‌ గ్రామ పంచాయతీలో కాషాయ పార్టీ చావుదెబ్బ తింది.

300మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు

300 మంది ఉగ్రవాదులు భారత్‌లో ప్రవే శించేందుకు భారత్‌-పాక్‌ నియంత్రణ రేఖ వద్ద స్థావరాల్లో సిద్ధం గా ఉన్నారు. మేము తీసుకున్న సమష్టి చర్యలు, వారి దాడులను సమర్థంగా తిప్పికొట్టగలిగే రక్షణ వ్యవస్థ వల్ల చొరబాట్లు విఫలమవుతున్నాయి. అందుకే భారత్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపి వెనక్కి వెళ్లిపోతున్నారు. 7వ తేదీన ప్రధాని మోదీ జమ్ము-కశ్మీర్‌లో పర్యటించనుడటంతో పాక్‌ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయని లెఫ్టినెంట్‌ జనరల్‌ సతీష్‌ దువా తెలిపారు .

 

రాముడి జన్మస్థలం పాకిస్థానా?

హిందువులు భగవానుడుగా భావించే రాముడు పుట్టింది అయోధ్యలో కాదా? అసలాయన పుట్టింది త్రేతా యుగంలోనే కాదా? కాదనే తాజాగా వెలువడ్డ ఒక పుస్తకం చెబుతోంది. 'ఫ్యాక్ట్స్‌ ఆఫ్‌ అయోధ్య ఎపిసోడ్‌ - మిథ్‌ ఆఫ్‌ రామ్‌ జన్మభూమి (అయోధ్య ఉదంతం వాస్తవాలు - రామ జన్మభూమి భ్రమ)' అనే పేరున్న ఈ పుస్తకాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) సభ్యుడు అబ్దుల్‌ రహీం ఖురేషీ రాశారు. రాముడు గంగా మైదానంలో జన్మిం చినట్టు వేదాల్లో గానీ, పురాణాల్లో గానీ ఎక్కడా పేర్కొనలేదని ఖురేషీ వాదిస్తున్నారు.

బీఫ్ తింటే తలనరికేస్తాం:బిజెపి

 హిందూత్వ వాదుల 'బీఫ్‌' వివాదం తారా స్థాయికి చేరింది. బీఫ్‌ తింటే తల నరికేస్తానని, దాంతో 'ఫుట్‌బాల్‌' ఆడుకుంటానని సీనియర్‌ బిజెపి నేత ఒకరు ఏకంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే హెచ్చరికలు జారీ చేశారు.బిజెపి షిమోగ జిల్లా కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ ఎడ్యూరప్పకు అతి సన్నిహితుడు చన్నబసప్ప మాట్లాడుతూ పై హెచ్చరికలు జారీ చేశాడు.

ప్యూడలిజం మళ్లీవచ్చింది:ఐలయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్యూడల్‌ పాలన కొనసాగిస్తున్నాయని, ప్రభుత్వాల తీరుపై విశ్లేషణాత్మకంగా ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రాసిన వ్యాసాల సంకలనం 'ప్యూడలిజం మల్లొచ్చింది' అద్దం పడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం 'ప్యూడలిజం మల్లొచ్చింది' పుస్తకావిష్కరణ సభ టిపిఎస్‌కె అధ్యక్షులు జి.రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో ప్యూడలిజం, క్యాపిటలిజం పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని, దాంతో ప్యూడలిజం నాశనమవ్వడం సులువుగా సాధ్యం కాదని అన్నారు.

Pages

Subscribe to RSS - November