November

బీహార్‌ ఎన్నికలు నేర్పుతున్న పాఠాలు

రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేస్తూ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని మహా కూటమి ఘనవిజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు బిజెపికి ప్రత్యేకించి మోడీ, అమిత్‌ షాల నాయకత్వాలకు పెద్ద ఎదురు దెబ్బ. అన్నిటినీ మించి సంఘ పరివార్‌ దేశంపై రుద్దాలనుకున్న సనాతన, భూస్వామ్య సంస్కృతి, వారి అనాగరిక చర్యలకు ఇది బీహార్‌ ప్రజల సమాధానం. కులం, ఉప కులం పేరుతో ప్రజలను చీల్చాలనుకోవడం, ప్రజల్లోని భక్తి భావాలను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే దృష్ట యత్నాలకు దీన్ని ప్రతిఘటనగా భావించవచ్చు. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్రా లేని ఆరెస్సెస్‌, మహాత్మా గాంధీని హత్య చేసిన ఆరెస్సెస్‌, సంఘ పరివార్‌ ఫాసిస్టు పోకడలకు ఇది అడ్డుకట్ట.

ఆంధ్రుల స్ఫూర్తి ప్రదాత బ్రౌన్‌..

ఆంధ్ర భాషా సారస్వతాలకు ఎనలేని సేవచేసిన ఆంగ్లేయ సివిల్‌ ఉద్యోగి, ఆంగ్ల విద్వాంసుడుగా గణుతికెక్కిన సర్‌ ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. మిణుకు మిణుకు మంటున్న తెలుగు సాహిత్యాన్ని ఒంటి చేత్తో కృషిచేసి జాజ్వల్యమానంగా వెలిగించే కర్తవ్యాన్ని నిర్వహించిన ఆంగ్లేయుడు. 1798 నవంబరు 10న ఒక క్రైస్తవ మిషనరీ కుటుంబంలో కలకత్తాలో (కోల్‌కతా) జన్మించాడు. ఆయన తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ బహు భాషా కోవిదుడు. తన పిల్లలు కూడా అలాగే కావాలని కోరుకునేవాడు. బ్రౌన్‌ చిన్ననాటి నుంచే ఇంగ్లీషు, హిబ్రూసిరియన్‌, అరబ్బీ, పారశీక, గ్రీకు, లాటిన్‌, బెంగాలీ, వంటి పెక్కు భాషలను క్షుణ్ణంగా అభ్యసించాడు.

మతతత్వ శక్తులకు చెంపపెట్టు..

బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు నితీష్‌ కుమార్‌ సారధ్యంలోని లౌకిక మహా కూటమికి తిరుగులేని ఆధిక్యంతో పట్టం కట్టి తమ విలక్షణతను చాటుకోవడం అభినందనీయం. జనం మధ్య చిచ్చుపెట్టే విచ్ఛిన్నకర మతతత్వ శక్తులను అధికారానికి ఆమడ దూరంలో పెట్టి బుద్ధుడు జన్మించిన గడ్డ వారసత్వాన్ని కొనసాగించడం హర్షణీయం. ఒక విధమైన ఉద్రేక భరిత వాతావరణం మధ్య జరిగిన బీహార్‌ ఎన్నికలు యావత్‌ దేశాన్నీ ఆకర్షించడమే కాకుండా నరాలు తెగే ఉత్కంఠ రేపాయి. అందుక్కారణం ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాకు, ప్రభుత్వానికి పరీక్షగా మారడమే.

ఎన్డీయేలో బిహార్‌ చిచ్చు!

బిహార్‌ ఫలితాలు ఎన్డీయే కూటమిలో చిచ్చుపెడుతున్నాయా? తాజా పరిణామాలను పరిశీలిస్తే ఔననే సమాధానం వస్తుంది. బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన హిందుస్థానీ ఆవామీ మోర్చా(హెచ్‌ఏఎం), లోక్‌ జనశక్తిపార్టీ(ఎల్జేపీ) నేతలు బీజేపీ, ఆరెస్సెస్‌ నేతల వ్యాఖ్యలే ఎన్డీయే ఓటమికి కారణమయ్యాయని సోమవారం ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు అమితషా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత వ్యాఖ్యలు ఎన్డీయేని ఓటమి దిశగా నడిపించాయని హెచ్‌ఏఎం అధినేత జితిన్‌ రాం మాంఝీ ఆరోపించారు.

తీవ్రం కానున్నOROP ఆందోళన..

ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్‌కు సంబంధించి అన్ని డిమాండ్లను అమలు చేయలేమంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై మాజీ సైనికులు విరుచుకు పడుతున్నారు. ఈ ప్రకటనకు నిరసనగా మంగళవారం నుంచి తమ పతకాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తాము లెక్కకు మించిన డిమాండ్లు చేయడం లేదని తమ డిమాండ్ ఒక్కటేనని అది ఒకే ర్యాంకు ఒకే పెన్షనేనని వారు స్పష్టం చేశారు. గతంలో తమకు వచ్చిన పతకాలను రేపటి నుంచి వెనక్కి ఇచ్చేయడం ద్వారా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించారు.

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ?

 బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయం ఎదురైనందున త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 26నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించి, సరిగా పనిచేయని కొంత మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి..

 

హిందూరాజ్య నిర్మాణం అవివేకం..

ప్రజాస్వామిక, లౌకికవాదంతో పరిఢవిల్లుతున్న భారత దేశంలో బీజేపీ హిందూ రాజ్యాన్ని నిర్మించాలనుకోవడం అవివేకమని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు అన్నారు. బీజేపీ హిందూ వాద రాజకీయాలు చేయాలనుకుంటే భారతీయులు అంగీకరించరని బిహార్‌ ఎన్నికలు రుజువు చేశాయని పేర్కొన్నారు.

ధరలపై యుద్ధం..

ఇటు రైతులను అటు వినియోగదారులను కట్టకట్టి అందినకాడికి దోపిడీ చేసే దళారీ వ్యవస్థను మరింతగా స్థిరీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నడుంబిగించడం ఆందోళన కలిగించే అంశం. ఈ దుష్పరిణామం పివి నరసింహారావు 'సంస్కరణ'లతో పురుడు పోసుకొని వాజపేయి హయాంలో మొగ్గ తొడిగి మన్మోహన్‌ సమయంలో కొమ్మలుగా విస్తరించి చివరికి మోడీ నేతృత్వంలో వటవృక్షమైంది. రైతుల, వినియోగదారుల మూలుగ పీల్చే కేంద్ర విధానాలకు రాష్ట్రం తందాన అంటోంది.

సుజనావ్యాఖ్యలను ఖండించిన ఐద్వా

ఎన్డీయే ఎన్నికల వాగ్దానాల మేరకు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. ప్రభావతి, డి.రమాదేవి ప్రకటనలో కోరారు. మహిళలకు రిజర్వే షన్లు అవసరం లేదన్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించారు. అన్ని రంగాలతోపాటు రాజకీయాల్లో కూడా తీవ్ర అసమానతలున్నాయని, పార్లమెంటు, శాసనసభల్లో 10 శాతానికి మించి మహిళలు లేరని తెలిపారు. కనీసం 33 శాతం వరకైనా రిజర్వేషన్లు ఉంటే తప్ప రాజకీయ రంగంలో స్త్రీలు నిలదొక్కుకునే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

Pages

Subscribe to RSS - November