November

ISIS,RSSలకు తేడా ఏంలేదు..

న్యూఢిల్లీ : ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌), ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య పెద్ద తేడా లేదని ప్రముఖ మేధావులు విమర్శించారు. స్వేచ్ఛగా జీవించే హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాల్సిందిగా వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. 2013 ఆగస్టులో పూనెలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దాభోల్కర్‌ జన్మదినోత్సన్ని పురస్కరించుకొని 'ప్రతిఘటన' పేరుతో పలువురు రచయితలు, కళాకారులు, మేధావులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆదివారం ఇక్కడ సమావేశమయ్యారు.

కమ్ముకుంటున్నఅణుయుద్ధ మేఘాలు

అమెరికా నేతృత్వంలోని నాటో, రష్యా మధ్య నెలకొంటున్న సైనిక, అణుయుద్ధ వాతావరణం ప్రపం చాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెడుతోందని అమెరికా శాంతి మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు తూర్పు ఐరోపా లో ప్రధానంగా ఉక్రెయిన్‌, సిరియాలలో రెండు అణ్వస్త్ర దేశాలకు చెందిన సైన్యాలు ముఖాముఖి తలపడేందుకు సిద్ధంగా వున్నాయని తెలిపింది.

సిపిఎం నేత హలీమ్‌ కన్నుమూత

కోల్‌కతా : సిపిఎం ప్రముఖ నేత, బెంగాల్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ హషిమ్‌ అబ్దుల్‌ హలీమ్‌ (80) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. 1982 నుండి 2011 వరకు అంటే 29ఏళ్ళ పాటు నిరాటంకంగా బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన రికార్డు కామ్రేడ్‌ హలీమ్‌ సొంతం. అసెంబ్లీ సభ్యులతో సుహృద్భావ సంబంధాలు కొనసాగించిన హలీమ్‌ తొలుత లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభి ంచారు. కాగా హలీమ్‌ మృతి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో విచారాన్ని వ్యక్తం చేసింది.

గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధం..

రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమీపంలో మూడు గ్రామాలను ఖాళీ చేయించే ందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా ఆ గ్రామాల వివరాలు తీసుకుంటోంది. వీటితో పాటు ప్లానింగ్‌కు ఇబ్బందిగా ఉందనే పేరిట దొండపాడు గ్రామాన్నీ దాదాపు ఖాళీ చేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం నుండి స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలందాయి. దీంతో రెవెన్యూ అధికారులు ఆ మూడు గ్రామాల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది.

త్యాగాలు చేసేది కమ్యూనిస్టులే:గపూర్‌

కమ్యూనిస్టుల ఆశయం అంటే ప్రజల కోసం పనిచేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గపూర్‌ అన్నారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన కంటే రంగారావు 29వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకొచ్చిన వారు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేది కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కందిపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వాలు వ్యాపార వర్గాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. 

అభివృద్దికి నోచని ఉత్తరాంధ్ర : కృష్ణమూర్తి

నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర అభివృద్ధి సదస్సు రణస్థలంలోని దేవిశ్రీ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోనే అత్యధిక వర్షపాతం, 16 జీవనదులు, మరెన్నో జీవగెడ్డలు ఉన్నాయని, అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జ్యూట్‌, ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడి 30 వేల మందికి ఉపాధి పోయిందన్నారు.

పెరిగిపోతున్న అరాచక ధోరణులు..

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశమంతటా కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అరాచక చర్యలకు పూనుకుంటు న్నాయి. బిజెపికి చెందిన దళాలు, పరిషత్తులు, వాహినులు వీటిలో ముందెత్తున పాల్గొంటున్నాయి. కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ శక్తులకు మద్దతిస్తున్నారు. శివసేన కూడా బిజెపి కంటే తానే ఒక ఆకు ఎక్కువ చదివాననే చందం గా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మైనారిటీలు, దళితులు, అభ్యుదయవాదులు, చింతనాపరులు, కవులు ఈ శక్తుల చేతుల్లో చంపబడుతున్నారు. అవమానాల పాలవుతు న్నారు. మైనార్టీల ప్రార్థనాలయాలు ధ్వంసమ వుతున్నాయి.

ప్రజాసమస్యలు గాలికి - ప్రశ్నిస్తే నిర్బంధం

 రాష్ట్రంలో 16 మాసాల క్రితం ఏర్ప డిన తెలుగుదేశం ప్రభుత్వం హామీ లను ఉల్లంఘించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి భారా లను మాత్రం పెంచింది. ప్రైవేటీక రణకు పెద్దపీట వేస్తున్నది. కనీసపు ప్రజా స్వామిక హక్కులను కూడా అనుమతించ కుండా తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నది.
వైద్యం

ప్రపంచీకరణ రెండవ అవతారం..

క్రెడిట్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చి (సిఎన్‌ఐఆర్‌) తన తాజా నివేదికలో 'ప్రపంచీకరణ' భవిష్య త్తుపై అనేక ఆలోచనలు మన ముందుంచింది. ప్రపంచీకరణను సిఎన్‌ఐఆర్‌ రెండు ప్రధాన స్రవంతులుగా అభి వర్ణించింది. ఒకటి, ఐరోపా దేశాల్లో, అమెరికాలో ప్రధానంగా 1870లో ప్రథమ ప్రపంచీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంలో రైలు, రోడ్డు, నౌకాశ్రయాలు నిర్మితమయ్యాయి. సూయజ్‌ కెనాల్‌ నిర్మాణం జరిగింది. ప్రపంచ వాణిజ్యానికి తోడ్పడి పారిశ్రామిక విప్లవ ప్రతిఫలంగా అమెరికా బలపడింది. కార్పొరేట్‌ సంస్థలకు తోడ్పడే బ్యాకింగ్‌ వ్యవస్థ పటిష్టతకు నాందీ పలికింది. మొదటి ప్రపంచయుద్ధ ప్రారంభంతో 1914తో ప్రథమ ప్రపంచీకరణ శకం ముగిసింది.

Pages

Subscribe to RSS - November