ప్యూడలిజం మళ్లీవచ్చింది:ఐలయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్యూడల్‌ పాలన కొనసాగిస్తున్నాయని, ప్రభుత్వాల తీరుపై విశ్లేషణాత్మకంగా ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రాసిన వ్యాసాల సంకలనం 'ప్యూడలిజం మల్లొచ్చింది' అద్దం పడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం 'ప్యూడలిజం మల్లొచ్చింది' పుస్తకావిష్కరణ సభ టిపిఎస్‌కె అధ్యక్షులు జి.రాములు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దేశంలో ప్యూడలిజం, క్యాపిటలిజం పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని, దాంతో ప్యూడలిజం నాశనమవ్వడం సులువుగా సాధ్యం కాదని అన్నారు. మోడీ పాలనలో జరుగుతున్న మత అసహనాలు దేశాన్ని మధ్య యుగానికి తీసుకుపోవడానికి ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు.