
300 మంది ఉగ్రవాదులు భారత్‌లో ప్రవే శించేందుకు భారత్-పాక్ నియంత్రణ రేఖ వద్ద స్థావరాల్లో సిద్ధం గా ఉన్నారు. మేము తీసుకున్న సమష్టి చర్యలు, వారి దాడులను సమర్థంగా తిప్పికొట్టగలిగే రక్షణ వ్యవస్థ వల్ల చొరబాట్లు విఫలమవుతున్నాయి. అందుకే భారత్‌లోకి ప్రవేశించి కాల్పులు జరిపి వెనక్కి వెళ్లిపోతున్నారు. 7వ తేదీన ప్రధాని మోదీ జమ్ము-కశ్మీర్‌లో పర్యటించనుడటంతో పాక్ దళాలు కాల్పులకు తెగబడుతున్నాయని లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా తెలిపారు .