
అసహనం గురించి తమ ప్రభుత్వానికి పాఠాలు చెప్పే అర్హత కాంగ్రెస్‌కు లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 1984లో సిక్కులపై జరిగిన దాడులను గుర్తు చేస్తే కాంగ్రెస్ సిగ్గుతో తల దించుకోవాల్సివుంటుందని మోడీ మండిపడ్డారు. ఈరోజు నవంబర్ 2..1984ను గుర్తు చేసుకుందామా? ఇందిరాగాంధీ హత్య(అక్టోబర్ 31) తర్వాత రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు..ఢిల్లీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో లక్షలాది సిక్కులపై దాడులు జరిగాయి..కాంగ్రెస్ పార్టీ నేతలపై బలమైన ఆరోపణలున్నాయి. బాధితుల గాయాలు ఇంకా మానలేదు, వారి కన్నీళ్లు ఇంకా ఇంకిపోలేదని మోడీ అన్నారు.