
బీహార్ ఎన్నికల్లో ఓటమిపై బీజేపీలో అంతర్మథనం మొదలైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా భేటీ అయ్యారు. బీహార్ ఎన్నికల్లో ఓటమికి ఆర్ఎస్ఎస్ సహకరించిందన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.బీహార్‌లో ఆర్ఎస్ఎస్ ఎన్నిక చేసిన అభ్యర్థులను కాకుండా బీజేపీ స్వతహాగా అభ్యర్థులను పోటీకి నిలబెట్టినట్లు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అందుకే రిజర్వేషన్లు పున:సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ కావాలనే ప్రచారం చేసిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.