కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజయవాడ విద్యార్థులు రాజ కీయ కోణంలో ప్రశ్నలు సంధించి ఝలక్ ఇచ్చారు. ఆమె విజయవాడ కెబిఎన్ కళాశాల విద్యార్థులతో మంగళవారం ఏర్పాటైన ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులు, వర్సిటీల్లో రాజకీయాలు తదితర అంశాలపై విద్యార్థులు పలు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై వెనకడుగు ఎందుకని శ్రీదుర్గ అనే ఎంసీఏ విద్యార్థిని మంత్రిని ప్రశ్నించారు. అది తన పరిధిలోని విషయం కాదని మంత్రి జవాబు దాట వేశారు.
District News
కృష్ణా నదిపై తెలంగాణ సర్కారు నిర్మించ తలపెట్టిన వివాదాస్పద రంగారెడ్డి -పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో నిర్వహించిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడుగడుగునా అరెస్టులు చేశారు. దీంతో విజయవాడ అలంకార్ కూడలి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు రణరంగంలా మారింది. బ్యారేజీ సందర్శనకు అనుమతి లేదంటూ వందలాది మంది పోలీసులు నాయకులను అడ్డుకున్నారు.
సీపీఎం కేంద్ర కార్యాలయంపై బీజేపీ దాడిని ఖండిస్తూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేరళలో లెఫ్ట్ పార్టీల విజయాన్ని తట్టుకోలేకే బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా పుష్కరాల పేరు చెప్పి ఘాట్‌ను నిర్మిస్తామని, ప్రజల ఇబ్బందును తొలగించేందుకు ఇళ్ళు తొలగించాల్సి వస్తుందని మాయమాటలు చెబుతున్న తెలుగుదేశం ఈ ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో సింగపూర్, జపాన్‌కంపెనీల వ్యాపారాల కోసం పేదల ఇళ్ళు కూల్చడం అన్యాయం. వెంటనే ఈ చర్యలు వెనక్కి తీసుకోవాలని కోరుతూ కరకట్టవాసులు శుక్రవారం ఉదయం సైన్స్‌సెంటర్ వద్ద పెద్దఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు శ్రీ సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ కృష్ణాపుష్కరాలకు నిజంగా ఇళ్ళు తొగించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే కరకట్ట వాసు ఇళ్ళకు కృష్ణానదికి మధ్యలో పున్నమీ హోటల్, సైన్స్ సెంటర్, ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌ు మరియు స్థలాలు ఉన్నాయి....
మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబీవీకే), ప్రజాశక్తి బుకహేౌస్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని ఐవి ప్యాలెస్‌లో '25 ఏళ్ల సంస్కరణలు - ఫలితాలు' అనే అంశంపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు.సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభానికి గురైందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయన్నారు. విదేశీ ఉత్పత్తులను స్వేచ్ఛగా అనుమతించటంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లభించటంలేదన్నారు. సరళీకరణ వల్ల దేశంలో పారిశ్రామికాభివృద్ధి క్షీణించిందన్నారు. బీహెచ్‌ఈఎల్ వంటి సంస్థల్లో ఉత్పత్తి తగ్గినట్లు తెలిపారు.
25 ఏళ్ల సరళీకరణ విధానాల వల్ల దేశంలో అన్ని రంగాల్లోనూ అసమానతలు తీవ్రంగా పెరిగాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడటంతోపాటు భారత దేశానికి అనుకూలమైన సోషలిస్టు ప్రత్యామ్నాయం కోసం కృషి చేయటం ప్రజలముందున్న కర్తవ్యమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ స్పష్టం చేశారు. మార్క్సిస్టు మేథావి మాకినేని బసవపున్నయ్య తన జీవితాంతం సోషలిజం కోసం పని చేశారని, దేశంలో సోషలిస్టు ప్రత్యామ్నాయాన్ని సాధించటమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని కరత్ చెప్పారు. 25 ఏళ్లలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు దేశ ఆర్థిక రంగం మీదే కాకుండా రాజకీయ, సామాజిక, సాంస్కృక రంగాలన్నింటిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు. సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించటంతోపాటు ప్రత్యామ్నాయాన్ని...
నిన్న అంబేద్కర్ కి 125అడుగుల విగ్రహం కడతామని గొప్పలు చెప్పి . . . ఈరోజు రాజ్యాంగ విరుద్దంగా CRDA పరిధిలో ఇచ్చే ఉద్యోగాలకు రిజర్వేషన్స్ వర్తించవు అని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం దారుణం . విజయవాడలో సీపీఎం నిరశన .
ఒక పక్కన అధికారులతో నోటీసు ఇప్పిస్తూ, ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తూ మరోపక్కన మీరెవ్వరూ నోటీసులు తీసుకోవద్దు మీకు మేము అండగా వుంటామని చెబుతున్న తొగుదేశం ప్రజాప్రతినిధు ప్రజలను మోసగించవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు సి.హెచ్. బాబూరావు అన్నారు. ఆదివారం భవానీపురం పున్నమి హాోటల్ వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్రలో బాబూరావు పాల్గొని కరకట్ట వాసుతో మాట్లాడారు. నోటీసులు తీసుకోవద్దని చెప్పే ప్రజాప్రతినిధులు తమ అధికార పార్టీ అధినేతతో మాట్లాడి నోటీసు రద్దుచేయిస్తే ఈ సమస్య ఉండదన్నారు. ఆ పనిచేయకుండా ఇక్కడకు వచ్చి ఈ రకంగా మాట్లాడటం ప్రజను మోసగించటమే అవుతుందన్నారు. ఇప్పటికైనా తొగుదేశం పార్టీ కరకట్ట ఇళ్లు తొగించానుకుంటున్నారా, ఇక్కడే...
ప్రజాసమస్యలు పరిష్కరించకుండా జీతాలు పెంచుకోవడం సిగ్గుచేటు.
- సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్
ప్రజా సమస్యలు పక్కన పెట్టి కార్పొరేటర్ల జీతాలు, అలవెన్సులు పెంచుకునే పనిలో అదికాపక్షం వుందని, మరో ప్రక్క జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదని ఇది సిగ్గుపడాల్సిన విషయం అని కాశీనాథ్ అన్నారు. సోమవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం సిపిఎం కార్పొరేటర్ నిలదీయనున్నారని తెలిపారు. దీనితో పాటు పలు అంశాలపై కౌన్సిల్ చర్చించాలని ఆయన కోరారు. మేయర్ ఏకపక్షంగా కౌన్సిల్ నిర్వహించినట్లయితే కౌన్సిల్ లోప, బయట ఆందోళన చేపట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. ...
'అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగుతున్నాం.. గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఎందుకు అడ్డుకోవటం లేదో తేల్చి చెప్పాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం శాంతిథియేటర్ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారుగన్నవరం ప్రాంతంలో నిజమైన అభివృద్ధి ఎలా జరగాలో గతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య చేసి చూపారని గుర్తు చేశారు. కేసరపల్లిలో ఐటి పార్కు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు. రైతులకు నష్టం కలిగించే భూసేకరణకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాల్లోకి రావాలన్నారు. గన్నవరం ఎంఎల్‌ఎ రామవరప్పాడులో...