District News

భారత్‌బంద్‌లో భాగంగా విజయవాడలో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. పెట్రోల్‌ బంక్‌లు మూతపడగా, దుకాణాలు మూసే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. బంద్‌ వాతావరణం స్పష్టంగా కనిపించింది. 

ఆగస్టు 28,2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ హైదరాబాద్ లో ఆందోళనచేస్తున్న ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా జరిగిన కాల్పులలో మరణించిన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి , బాలస్వాములకు సిపిఎం రాష్ట్ర కమిటీ నివాళి అర్పించింది. ప్రపంచబ్యాంక్ విధానాలను అమలు చేస్తున్న చంద్రబాబు ప్రజలపై, కార్మికులపై భారాలను మోపుతున్నాడు..ఈ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల త్యాగాల స్పూర్తితో ఉద్యమాలను మరింత ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర కమిటీ తెలియజేసింది. అమరవీరుల చిత్ర పటాలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, మంతెనసీతారం, సిహెచ్ బాబురావులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..

విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన ప్రజా రక్షణ యాత్ర వాంబేకాలనీలో సాగింది. ఈ యాత్రను మధు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు 90 వేల ఎకరాలను సేకరించారని, కానీ పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా కేటాయించడంలేదని అన్నారు. రాజధానికి సేకరించిన 90 వేల ఎకరాల్లో పది వేల ఎకరాలు ఇస్తే చాలని, రాజధాని ప్రాంతంలోని అర్హులైన పేదలందరికీ ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున స్థలం ఇవ్వొచ్చని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ఇళ్లస్థలాల సాధనకు ఐక్యంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతును కూడగడతామని చెప్పారు.  

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో రైతులతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ముఖముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాని మార్పు చేసి రైతుల నుండి బలవంతంగా భూమి గుంజుకుంటుందని అన్నారు. భూసేకరణ చట్టంలో రైతుల నుండి భూమి తీసుకున్న తర్వాత 5సంవత్సరలోపు ఎటువంటి పనులు ఆభూములలో చేయకపోతే తిరిగిరైతుకు భూమి ఇవ్వాలని ఉందని కానీ చంద్రబాబు భూసేకరణ చట్టసవరణ ద్వారా ఆ విషయాన్ని చట్టం నుండి తొలగించారని అన్నారు.. రైతులకు అండగా సిపిఎం ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

సిఎం చంద్రబాబు పాలన వ్యాపారమయంగా మారిపోయిందని, పౌర సేవలను డబ్బులిచ్చి కొనుక్కోవాల్సి వస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ యాత్ర ఆదివారం విజయవాడలోని 45వ డివిజన్‌ మధురానగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని, ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సి బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు పాలకులు చేస్తున్న అన్యాయాలను వివరించడానికి చేపట్టిన ప్రజారక్షణ యాత్రకు అందరూ మద్దతు తెలిపాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ సామాన్యులు ఎక్కడైనా ఇల్లు...

రాష్ట్రంలో ప్రజానుకూల, నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలతో కలసిరావాలని అభ్యుదయ, ప్రజాతంత్ర శక్తులకు, సంఘాలకు పట్టణ ప్రాంత సమస్యలపై విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సులో నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల పై పన్నుల భారం లేకుండా ఉండాలని, స్థానిక సంస్థ లకు 40 శాతం రాష్ట్ర ఆదాయాన్ని బదలాయించాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 16 నుంచి 24 వరకు అన్ని నగరాల్లో సమస్యల పరిష్కారానికై పాదయాత్ర నిర్వహించాలని, అందరికీ ఇళ్లు కోసం మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేయాలని సదస్సులో నిర్ణయించారు. సెప్టెంబర్‌ 15న 'మహాగర్జన' పేరుతో విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహిస్తామన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో నాలుగేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు దిగజారాయని, ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని సిద్దార్థ అకాడమీ ఆడిటోరియంలో జరిగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గురించి, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపైనా విస్తృత సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని సమావేశం అభిప్రాయ పడింది. కేంద్రం పెట్రోలు, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడంతో రైతులపై వందల కోట్ల రూపాయల భారాలు పడ్డాయని, ఇదే సమయంలో రైతులకు గిట్టుబాటు...

విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద గురువారం మహాధర్నా నిర్వహించిన అనంతరం సిపిఎం నేతలు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నగర పాలక సంస్థ కమిషనర్‌ జె.నివాస్‌కు అందజేశారు. వినతిపత్రం అందించేందుకు నేతలు వస్తున్నారని తెలుసుకున్న కమిషనర్‌ స్వయంగా తన చాంబర్‌ నుండి బయటకు వచ్చారు. కార్యాలయం ఆవరణలో నేతల వద్ద నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు కమిషనర్‌తో మాట్లాడుతూ కొండ ప్రాంతవాసులకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ సమస్యను పరిష్కరించాలని, కాల్వగట్లు, కృష్ణాకరకట్ట వాసులకు పట్టాలివ్వాలని, జక్కంపూడిలో శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కోరారు. కబేళా, సింగ్‌నగర్‌లో, జక్కంపూడి వైఎస్‌ఆర్‌కాలనీలో మధ్యలో...

Pages