District News

ఏ.కొండూరు కిడ్నీ బాధితులందరికి ఆర్థికసహయం, ఆయా కార్పొరేషన్ల నుండి ఋణాలు, తిరువూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం, అన్ని గ్రామాలకు పైపులైన్ ద్వారా కృష్ణ జలాల సరఫరా, పెన్షన్లు, డయాలసిస్ చేయించుకునే వారికి అంబులెన్స్, ఉచితంగా మందుల సరఫరా, చనిపోయిన కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రకటించిన 5 లక్షల ఎక్స్ గ్రెసియా వెంటనే ఇవ్వాలి.భావితరాలకు కిడ్నీ సమస్య రాకుండా చౌక డిపోల ద్వారా పౌష్టికాహారం అందించాలి వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ch. బాబురావు గారు,సిపిఎం పశ్చిమ కృష్ణ కార్యదర్శి d.v కృష్ణ గారు,జిల్లా కమిటీ సభ్యులు g. విజయప్రకాశ్ గారు అధికారులకు వినతిపత్రం అందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది.  బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అన్యాయం చేసిన కేంద్రం, ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు.విభజన చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులేవీ బడ్జెట్‌లో దక్కలేదన్నారు. చంద్రబాబు కేంద్రంతో కలిసి నాటకాలాడుతున్నారని, కేంద్రం దగ్గర ఒక మాట, ఇక్కడ మరో మాట చెబుతున్నారని విమర్శించారు.

గోట్టిపాడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ సిపిఎం నాయకులు చేపట్టిన  పర్యటనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి  పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణయ్య ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు.దళితులపై దాడుల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెత్తందార్లకు వత్తాసు పలుకుతోందని మధు విమర్శించారు. గొట్టిపాడులో దళితులపై దాడి చేసిన కులోన్మాదుల్ని 307 సెక్షన్‌ కింద అరెస్ట్‌ చేయాలని, దళితులపై మోపిన అక్రమ కౌంటర్‌ కేసులు ఎత్తివేయాలని, దళితులకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి, ఆ పంచాయతీకి ప్రత్యేక రహదారి సౌకర్యం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌...

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి.  విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ  రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన బిజెపి, టిడిపి నాయకులు అధికారంలోకి రావడంతోనే ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన...

కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి గూండాల దాడులను సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిపిఎంపై దాడులకు పాల్పడుతున్నారని, 90 ఏళ్ల దేశ చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ఒక రాజకీయపార్టీ కార్యాలయాల ముందు మరో రాజకీయ పార్టీ ఆందోళనలు నిర్వహించడం ఇదే తొలిసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విశాఖలోనూ ఇదే తరహాలో దాడులు చేశారని, ఇదే విధంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం వ్యవహరిస్తే తగిన బుద్ధి...

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..

కేంద్ర ప్ర‌భుత్వం వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు విజ‌య‌వాడ‌లో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ చేపట్టారు. నెలకు 4 రూపాయల చొప్పున గ్యాస్ రేటు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ పై సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో దళితులపై పలు విధాలుగా జరుగుతున్న దాడులు, కులవివక్ష, దళితుల భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పది వామపక్షాలు రాష్ట్ర సదస్సు నిర్వహించాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి తదితర గ్రామాల్లో అనేక దశాబ్దాలుగా సాగు చేస్తున్న దళితుల భూముల్ని 'నీరు-చెట్టు' పేరుతో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం, పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రులో దళితులపై గత మూడు నెలలుగా సాంఘిక బహిష్క రణ చేయడం, చిత్తూరు జిల్లాలో మహాభారతం పేరుతో సాగే ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్ష కనబర్చడం వంటి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఇతర...

హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని నేడు విద్యార్థులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియచేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు తెలిపారు..విద్యార్థులు కోరుతున్న విధంగా మెస్ చార్జీలను రూ. 750 నుండి రూ. 1500 కు పెంచాలని,హాస్టల్స్ మూసివేతను నిలిపి వేయాలని,సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్ 2017 ను రద్దు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

Pages