District News

ఉల్లి ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా ప్రతి కుటుంబానికి 5కిలోల ఉల్లిపాయలు సప్లే చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని రైతుబజార్ లో పర్యటించి కొనుగోలుదారుల భాదలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాద్, శ్రీదేవి తో పాటు సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు..

ఇసుక సమస్య ను పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు భృతిగా నెలకు 10వేలు ఇవ్వాలని , ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడలో వామపక్ష పార్టీలు తలపెట్టిన ఇసుక మార్చ్ ను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించగా  తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వామపక్ష నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చడం వంటివి సోషలిజంతోనే సాధ్యమని అక్టోబర్‌ విప్లవ దినోత్సవ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్‌ విప్లవ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పెట్టబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని చూపించి, కార్మికవర్గం పరిపాలన చేయవచ్చని సోవియెట్‌ యూనియన్‌ ప్రపంచానికి నిరూపించిందని గుర్తుచేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపాలనను అధికారంలోకి తీసుకురావడంలో ఎర్రజెండా కీలకపాత్ర పోషించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు స్వాతంత్రోద్యమంతో సంబంధంలేని, త్యాగాలకు దూరంగా ఉండి, బ్రిటీషు వారికి ఊడిగం చేసిన ఆరెస్సెస్‌కు...

ఇసుక కొరత వల్ల పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు సిపిఎం అండగా ఉంటుందని, కార్మికులు ధైర్యంగా ఉండాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్మికులు అర్ధాకలితో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే వారి కష్టాలను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఆకలి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ఒక్కో కార్మిక కుటుంబానికి రూ.10వేలు పరిహారం తక్షణమే అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే తదుపరి...

ఆంధ్రప్రదేశ్ లో నూతన రాజకీయ ప్రత్యా మ్నాయం కోసం వామపక్షాలు చేపట్టిన మహాగర్జన కార్యక్రమం విజయవాడలో పెద్ద ఎత్తున జరుగుతోంది.  బిఆర్‌టిఎస్‌ రోడ్డులో మధురానగర్‌ వద్ద ఇప్పటికే సభావేదికను సిద్ధం చేశారు. పలు జిల్లాల నుండి కార్యకర్తలు నగరానికి చేరుకున్నారు. అనంతపురం, చిత్తూరు నుండి రెండు ప్రత్యేక రైళ్లు బయలు దేరాయి. మహాగర్జన బహిరంగసభలో పాల్గొ నేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ నగరానికి చేరుకున్నారు.సభకు ముందు నగరంలో రెండు మహా ప్రదర్శనలు జరగనున్నాయి. రైల్వేస్టేషన్‌ నుండి సాంబమూర్తిరోడ్డు మీదుగా ఒక ప్రదర్శన, గుణదల ఇఎస్‌ఐ ఆస్పత్రి నుండి మరోప్రదర్శన ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నగరంలోని అన్ని...

Pages