ఉల్లి ధరల పెంపుకు వ్యతిరేకంగా..

ఉల్లి ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా ప్రతి కుటుంబానికి 5కిలోల ఉల్లిపాయలు సప్లే చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని రైతుబజార్ లో పర్యటించి కొనుగోలుదారుల భాదలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాద్, శ్రీదేవి తో పాటు సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు..