ప్రజాసమస్యలు పరిష్కరించకుండా జీతాలు పెంచుకోవడం సిగ్గుచేటు.
- సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్
ప్రజా సమస్యలు పక్కన పెట్టి కార్పొరేటర్ల జీతాలు, అలవెన్సులు పెంచుకునే పనిలో అదికాపక్షం వుందని, మరో ప్రక్క జీతాలు పెంచమని ఆందోళన చేస్తున్న కార్మికులను పట్టించుకోవడం లేదని ఇది సిగ్గుపడాల్సిన విషయం అని కాశీనాథ్ అన్నారు. సోమవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం సిపిఎం కార్పొరేటర్ నిలదీయనున్నారని తెలిపారు. దీనితో పాటు పలు అంశాలపై కౌన్సిల్ చర్చించాలని ఆయన కోరారు. మేయర్ ఏకపక్షంగా కౌన్సిల్ నిర్వహించినట్లయితే కౌన్సిల్ లోప, బయట ఆందోళన చేపట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. ్ ప్రజాస్వామ్య పద్దతిలో నిర్ణయాలు తీసుకునే రీతిలో కౌన్సిల్‌ను నిర్వహించాల్సిన బాధ్యత మేయర్‌పై ఉందన్నారు. ఇప్పటి వరకు జరిగిన కౌన్సిల్ సమావేశాు అప్రజాస్వామిక పద్ధతిలో జరిగాయని విమర్శించారు. మునిసిపల్ కార్మికుల జీవితాలను నాశనం చేసే 279 జీఓపైన, స్వరాజ్యమైదానం పార్కుగా మార్పు, రైతుబజార్ తరలింపు, అమృత్‌పథకం అము తీరు, డ్వాక్రా రుణమాఫీ తదితర పు అంశాలపై కౌన్సిల్ చర్చ జరపాలని కొరారు.