2016

పసలేని ప్రధాని ఫసల్‌ బీమా యోజన

 ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పంటల బీమా) పథకంలో ప్రతికూలాంశాలే ఎక్కువగా ఉన్నాయనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. సామాన్య రైతుల కంటే కార్పొరేట్‌ వ్యవసాయ కంపెనీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం నూతన పంటల బీమా పథకాన్ని రూపొందించిందనే అభిప్రాయపడుతున్నారు. పంటల బీమాకు తోడు మరో ఏడు రకాల అంశాలను ఇందులో జొప్పించడంతోపాటు ప్రయివేటు బీమా కంపెనీలకు పెద్దపీట వేసిందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పంట లాభనష్టాలను అంచనా వేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొల్పకుండా రైతులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి.

మేలో సిఐటియు రాష్ట్ర 14వ మహాసభ..

ఐటియు రాష్ట్ర 14వ మహాసభ మే నెలాఖరులో జరుగుతుందని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌.పుణ్యవతి, ఎం.ఎ.గఫూర్‌ తెలిపారు.కార్మికో ద్యమాలను మరింత బలోపేతం చేసి కార్మికులను సంఘటితం చేసేదిశగా నూతన రాష్ట్ర రాజధాని విజయవాడలో మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 1970లో సిఐటియు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విజయవాడలో రాష్ట్ర మహాసభ జరగనుందని పేర్కొన్నారు. కార్మిక సంఘాలపై స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన దాడులకన్నా ఇప్పుడు మరింత పెరిగాయని గఫూర్‌ అన్నారు

బ్లాక్ బ్యాడ్జీలతో అసెంబ్లీకి YCP ఎమ్మెల్యేలు

 వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం శాసనసభకు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కుట్ర పూరితంగా టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంటుండటమేగాక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను వేధిస్తున్నందుకు నిరసన తెలిపేందుకు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. వెనుకబడిన ప్రాంతాల్లో సమస్యలు, అభివృద్ధిపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ మొదలు కాగానే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. పలువురు సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. సభ్యులకు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

పిడిపి-బిజెపి దోస్తీకి రంగం సిద్ధం..

 జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై ఉన్న అనిశ్చితి కాసేపట్లో తొలగనుంది. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మెహబూబా భేటీ కానున్నారు. బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీడీపీ సుముఖత చూపిస్తున్నట్లు సమాచారం.

సంఘపరివార్‌ ఆటలు సాగనివ్వం:ఏచూరి

దేశంలో నానాటికీి పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగంపౖౖె పోరాడాలని యువజన సంఘాల సదస్సులో సిపిఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. సోమవారం ఢిల్లీలో గాలిబ్‌ హాల్‌లో 13 వామపక్ష, ప్రజా తంత్ర యువజన సంఘాలు సంయుక్త జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మతతత్వ ఎజెండాను ఈ సదస్సు ఖండించింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏచూరి మాట్లాడుతూ, దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజలపై సరికొత్త దాడికి పూనుకుందని, ప్రజల మధ్య విచ్ఛిన్నకర భావాలను ప్రేరేపించి, విభజిం చు..!పాలించు..! విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు. 

పఠాన్‌కోట్‌ తీవ్రవాదుల ఫోటోలు విడుదల

పఠాన్‌కోట్‌ తీవ్రవాద దాడికి సంబంధించి పాకిస్తానీ దర్యాప్తు బృందం పర్యటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఆ ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు తీవ్రవాదుల ఫోటోలను విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల ఎత్తు, ఇతర వివరాలను వివరిస్తూ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. వారిలో ఒక తీవ్రవాదికి రెండు కాళ్ళకు బొటనవేలు లేదని కూడా తెలిపింది. ఈ చిత్రాను విడుదల చేస్తూ ఇంకా ఇతరత్రా సమాచారం ఏమైనా తెలిసివుంటే పంచుకోవాల్సిందిగా ప్రజలను కోరింది. సంబంధిత సమాచారాన్ని ఇస్తే వారికి లక్ష రూపాయిల వరకు బహమతి ఇవ్వబడుతుందని ఎన్‌ఐఎ తెలిపింది.

జై అంటే జాతీయవాదం ఉన్నట్టా?

''భారత్‌ మాతా కీ జై'' ప్రాతిపదికన జాతీయవాదాన్ని నిర్ణయించడాన్ని కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ సోమవారం తీవ్రంగా విమర్శించారు.భారత్‌ మాతా కీ జై అని అనడం నాకు సంతోషమే, అయితే అ ంత మాత్రాన అందరినీ అలా అనాల్సిందేనని నేను ఒత్తిడి తీ సుకురాగలనా? అని ప్రశ్నించారు. జెఎన్‌యులో విద్యార్ధులనుద్దేశించి ఆయన ఆదివారం రాత్రి మాట్లాడారు. కేవలం ''హిందీ, హిందూ, హిందూస్తాన్‌'' దేశం మనది కాదని, ఇది భారతదేశమని, మరింత వై విధ్యతను ఆమోదించే దేశమని అన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తుల స్వాధీనానికి తీర్మానం చేయాలి:బాబూరావు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తుల స్వాధీనానికి అసెంబ్లీలో తీర్మానం చేయా లని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూ రావు డిమాండ్‌ రూ.1200 కోట్ల విలువ చేసే హారు ల్యాండ్‌, కీసరలోని 200 ఎకరాల భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాల న్నారు. బాధితుల కోసం తక్షణమే రూ.2 వేల కోట్లతో ప్రభుత్వమే నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు ప్రభుత్వం అమ్ముడుపోయిందని, అందుకే ఏడాది పాటు కేసును తాత్సారం చేసిందని విమర్శించారు. డిజిపి జెవి రాముడు కూడా నిందితులకు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు.

నేడు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై ఛలో విజయవాడలో

పట్టణ, నగర ప్రాంతాల నివాసులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ప్రదర్శన, బహి రంగ సభ ఏర్పాటు కానున్నాయి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి గాంధీనగర్‌లోని జింఖానా క్లబ్‌ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు వామ పక్ష నాయకులు తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పట్టణ, నగ ర ప్రాంత వాసులకు ఒక్క ఇంటినిగానీ, నివేశన స్థలాన్నిగానీ మంజూరు చేయలేదని నాయకులు విమర్శించారు. సుమారు పది లక్షల మంది ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం జన్మభూమి మాఊరు గ్రామసభలలో దరఖాస్తు చేసుకు న్నారు.

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి

ఇళ్ళపట్టాలు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని మచిలీపట్న‌ ంలొ మున్సిపల్ కార్యాలయం వద్ద దర్నాలో మట్లాడుతున్న సి.పి. యం. జిల్లాకార్యదర్మి ఆర్. రఘు, చౌటపల్లి రవి, కోడాలి.శర్మ

Pages

Subscribe to RSS - 2016