అంబేద్కర్ గురించి అంద రూ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అని, దళిత వర్గా ల పెన్నిధి అని కీర్తిస్తు న్నారు. రిజ ర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాజాగా ప్రస్తుతించారు. అంబే ద్కర్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నీ సొంతం చేసుకునే దిశలో పోటీపడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి ఈ విషయంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంబేద్కర్ పేరు చెప్పి ఓట్లు పొందే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడే కాకుండా అంబేద్కర్ పేరు చెప్పడానికి సమయం కొనితెచ్చుకుంటున్నారు.