2016

అఫ్జల్‌గురుపై బిజెపి వైఖరి..?

 'జమ్మూ-కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడటాన్ని సంతోషంగా ఆహ్వానిస్తాం. కానీ, అఫ్జల్‌గురు పట్ల బీజేపీ-పీడీపీ వైఖరిని ఇప్పుడు బీజేపీ వెల్లడించగలదా' అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. 

యనమలతో వైకాపా ఎమ్మెల్యేల భేటీ

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలిద్దరూ ఆదివారం ఇక్కడ యనమలను ఆయన నివాసంలో కలిశారు. వారి భేటీలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెదేపా ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, తెదేపాలోకి చేరికలు వంటి అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

HCU విద్యార్థులకు 352 మంది విద్యావేత్తల మద్దతు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ(హెచ్‌సియు) ఘటనపై మేధావులు, విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు స్పందించారు. తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. హెచ్‌సియులో జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలను ఖండించారు. ఈ మేరకు వీరంతా కలిసి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రకటనపై సంతకం చేసిన వారిలో నోమ్‌ చామ్‌స్కీ, డా|| గాయత్రి చక్రవర్తి, స్పివాక్‌, డా|| బార్బరా హారిస్‌ వైట్‌, డా||గిలియన్‌ హార్ట్‌, డా|| మైఖేల్‌ డేవిస్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన 352 మంది ప్రొఫెసర్లు కూడా ప్రకటనపై సంతకాలు చేశారు. 

RSS వాళ్ళు ఎప్పుడు దేశభక్తులు అయ్యారో..

వెంకయ్యనాయుడుకు, బీజేపీ వారికి జేఎనయూ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్‌ను చూస్తే బెదురుగా ఉన్నట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో ఆయన సభను ఏర్పాటుచేస్తే దానిపై వెంకయ్య జోక్యం చేసుకుని రద్దు చేయించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. బ్రిటిష్‌ వారితో కుమ్మక్కయి వారికి దాసోహం అన్న RSS వారు ఎప్పట్నుంచి దేశభక్తులు అయ్యారో చెప్పాలన్నారు.

ఉమర్, కన్నయ్య లను కాల్చిపారేస్తాం..

‘నెలాఖర్లోగా ఢిల్లీ నుంచి పారిపోండి... లేదంటే దుర్గాష్టమిలోగా కాల్చిపారేస్తాం’’ అంటూ కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్‌లను ఓ రాజకీయ పార్టీ హెచ్చరించింది. భారత సైన్యంపై కన్నయ్య కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. మీరట్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర ప్రదేశ్ నవనిర్మాణ్ సేన జాతీయ అధ్యక్షుడు అమిత్ జానీ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ హెచ్చరికలను పోస్ట్ చేశారు.

బొగ్గు కుంభకోణంలో "ప్రత్యేక " తీర్పు.

బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక కోర్టు నుంచి తొలి తీర్పు వెలువడింది. జేఐపీఎల్ (జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్), జేఐపీఎల్ డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్టా , ఆర్‌సీ రుంగ్టా తప్పుడు డాక్యుమెంట్లతో జార్ఖండ్‌లో బొగ్గు క్షేత్రాలను పొందినట్లు సోమవారం తీర్పు చెప్పింది. ఈ ఇద్దరు డైరెక్టర్లను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.

మోడీజీ.. గిరిజనులను మోసం చేయకండి:బ్రిందా

మోడిజీ ... అస్సాం టీని అమ్మినందువల్ల అస్సాంతో ప్రత్యేక అనుబంధం ఉందని మీరు చెప్పారు. అయితే, టీని ఉత్పత్తిచేసిన కార్మికులతో మీకు ఎటువంటి అనుబంధం లేదు. తేయాకు పనులు తప్ప మరోకటి తెలియని ఆరు గిరిజన జాతులను గిరిజనులుగా గుర్తించడానికి మీరు నిరాకరిస్తుండటమే దీనికి నిదర్శనం. మీ మోసపూరత చర్యలతో వారిని ఇంకా అవమానపరచకండి. గిరిజనులను మోసం చేయడం మానుకోండి' అస్సాం ఎన్నికల సభలో బృందాకరత్‌. ఎన్నికల బరిలో నిలిచిన 25 సంవత్సరాల సంగీతాదాస్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన ఎన్నికల సభలో బృందాకరత్‌ పాల్గొన్నారు.

'చోడవరం సుగర్స్‌' పాలకవర్గం రాజీనామా చేయాలి

        చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతి బాధ్యత వహించి పాలకవర్గం రాజీనామ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. హుదూద్‌ తుపాన్‌ పంచదార అమ్మకాల్లో ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. హుదూద్‌ తుపాన్‌లో రూ.100 కోట్లు నష్టం వచ్చినట్లు అప్పట్లో సుగర్స్‌ చైర్మన్‌ చెప్పారని, వెనువెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంత నష్టం వాటిల్లలేదని, నష్టంపై స్పష్టత లేదని తెలిపారు. పంచదార అమ్మకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చేపట్టిన విచారణ కేవలం ఇన్సూరెన్స్‌ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు.

విజయవాడ,విశాఖ మెట్రోపై అనుమానాలు

అట్టహాసంగా నిర్మించాలని భావిస్తున్న విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైళ్లపై అనుమానాలు పెరుగుతున్నాయి. వాటికి నిధులు సమకూర్చాల్సిన ఆర్థిక సంస్థలే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తురడడం గమనార్హం. ఈ సందేహాలను నివృత్తి చేసేరదుకు రాష్ట్ర యంత్రారగం ఆయా సంస్థలకు వివరాలు సమర్పిరచేరదుకు సిద్ధమైనా, వాటిలో విశ్వసనీయత ప్రశ్నార్థకమే. ప్రధానంగా ఏ మెట్రో రైల్‌ నిర్మాణంలోనైనా భవిష్యత్‌లో పెరిగే ప్రయాణికుల రద్దీ అంచనాయే  కీలకం. 

Pages

Subscribe to RSS - 2016