2016

బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం

   ప్రజా ఉద్యమం తప్పదు : సిపిఎం
        ప్రభుత్వం మొండిగా వ్యహరించి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు సిద్ధపడితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం నక్కపల్లి డివిజన్‌ కన్వీనర్‌ ఎం.అప్పలరాజు హెచ్చరించారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం తన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక ప్రభావ నివేదికను బహర్గతం చేయాలన్నారు. అవేమి లేకుండా ప్రభుత్వ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.         

విద్యుత్ చార్జీల పెంపు అమలు..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరుగనున్నాయి. ఈ మేరకు 2016-17 విద్యుత్‌ టారీఫ్‌లు ఏపీఈఆర్సీ చైర్మన్ భవానీ ప్రసాద్ గురువారం విడుదల చేశారు. ఏపీలో రూ.216కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెరుగనున్నట్లు తెలిపారు. మొదట రూ. 783 కోట్లు పెంచాలని ఈఆర్సీ ప్రతిపాదించినప్పటికీ రూ.216కోట్లకే పరిమితం చేశారు. విద్యుత్ చార్జీల పెంపుతో గృహ వినియోగదారులపై భారం ఉండదని.... రేపటి నుంచి కొత్త చార్జీలు అమలులోకి రానున్నట్లు ప్రకటించారు.

2030 నాటికి పేదరికం కనబడదా?

అవునంటున్నారు పెట్టుబడిదారీ దేశాధి నేతలు. నిజానికి ఆయా దేశాల్లో ప్రభుత్వాధినేతలు రోజూ చెప్పేది అదే. అధికా రంలోకి వచ్చిన వాళ్లు పదవీ కాలంలో తిమ్మిని బమ్మిని చేస్తామని చెబుతుంటారు. అధికారం కోల్పోయిన వాళ్లు తమ కాలంలో దాదాపు పేదరికాన్నే నిర్మూలించినట్లు, తమ అనంతరం అంతా నాశనం అయిపోతున్నట్లు గగ్గోలు పెడు తుంటారు. ఏదిఏమైనా పేదరికం గురించి, పేదరిక నిర్మూలన గురించి జరిగేంత చర్చలో ఒక్క వంతు కూడా పేదరికానికి కారణాల గురించి మాత్రం జరగకుండా పాలక వర్గాలు, పలు పార్టీలు, వారి ఉప్పు తినే మేధావులు జాగ్రత్త పడుతుంటారు.
ఎండిజిల స్థానంలో ఎస్‌డిజిలు

ప్రభుత్వ భూదాహన్నివ్యతిరేకిస్తూ..

'అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను అడుగుతున్నాం.. గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణను ఎందుకు అడ్డుకోవటం లేదో తేల్చి చెప్పాలి' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భూదాహన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం శాంతిథియేటర్‌ సెంటర్‌లో బుధవారం వామపక్షాల ఆధ్వర్యాన బహిరంగ సభ నిర్వహించారుగన్నవరం ప్రాంతంలో నిజమైన అభివృద్ధి ఎలా జరగాలో గతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య చేసి చూపారని గుర్తు చేశారు. కేసరపల్లిలో ఐటి పార్కు ఏర్పాటై ఆరేళ్లవుతున్నా ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్నారు.

ఉద్యోగఖాళీల భర్తీపై మంత్రి యనమల..

 ఆంధ్రప్రదేశ్‌లో 20వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వయో పరిమితి సడలింపు అంశాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాలువ శ్రీనివాసులు ఈ ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల వయో పరిమితిని 45 ఏళ్ల వరకు సడలించాలని విన్నవించారు. 

ప్రజాసంక్షేమ కూటమిలో ఆప్‌చేరే సూచనలు

డీఎండీకే చేరికతో బలపడిన ప్రజాసంక్షేమ కూటమిలో ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కూడా చేరే సూచనలు కన్పిస్తున్నాయి. పొత్తు విషయమై కూటమి సమన్వయకర్త, ఎండీఎంకే నేత వైగో మరో రెండ్రోజుల్లో ఆప్‌ నేతలతో సమావేశం కానున్నారు. ఈ చర్చల్లో భాగంగానే ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూటమి సీఎం అభ్యర్ధి కెప్టెన్ విజయకాంత్‌ను కలుసుకుం టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

జగన్‌ కేసులో ఈడీ కొత్త ఛార్జిషీట్‌

జగన్‌ ఆస్తుల కేసు విషయంలో ఇప్పటి వరకు సీబిఐ ఇచ్చిన ఆధారాలతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగా రాంకీ ఫార్మాపై విచారిస్తోన్న ఈడీ జగతి పబ్లికేషన్‌లో రాంకీ పెట్టిన పెట్టుబడులపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ సంస్థ దాదాపు రూ. 10 కోట్లను జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడి పెట్టింది. దీనిద్వారా రూ. 144 కోట్ల లబ్ధి పొందినట్లు ఈడీ ఆరోపణలు చేస్తోంది. దీంతో రాంకీ ఫార్మాకు చెందిన 346 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 

Pages

Subscribe to RSS - 2016