2016

కోల్ స్కాం దోషులకు జరిమానా,జైలు

దేశంలో సంచలనం రేపిన కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణంలో తొలి తీర్పు సోమవారం వెలువడింది. మోసం, నేరపూరిత కుట్రలకు గాను ఝార్ఖండ్‌ ఇస్పాత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (జేఐపీఎల్‌) డైరెక్టర్లు ఆర్‌.సి. రుంగ్తా, ఆర్‌.ఎస్‌.రుంగ్తాలకు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. నిజాయతీ, నైతికతల్లేని ఇలాంటి వ్యాపారుల వల్ల భారత్‌ అభివృద్ధిలో వెనుకబడిపోతోందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రుంగ్తాలిద్దరికీ ప్రత్యేక సీబీఐ జడ్జి భరత్‌ పరాశర్‌ జైలుశిక్షతో పాటు రూ. 5 లక్షల వంతున జరిమానా విధించారు. జేఐపీఎల్‌ కంపెనీకి కూడా రూ. 25 లక్షల జరిమానా విధించారు.

బెంగాల్లో స్థానిక నేతలు Vs స్టార్స్

ఎన్నికల దగ్గరకొచ్చేకొద్దీ అన్ని పార్టీలూ స్టార్లను రంగంలోకి దింపుతుంటే సిపిఐ(యం) మాత్రం స్థానిక నేతలకు ప్రాధాన్యతనిస్తోంది. స్టార్లూ వర్సెస్‌ స్థానిక నేతలుగా ప్రచారం సాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సినీ, క్రీడా తారలకు ప్రాధాన్యతనిస్తుండగా... బి.జె.పి, కాంగ్రెస్‌ లోకల్‌ నేతల కంటే జాతీయ నాయకుల వైపే మొగ్గు చూపుతున్నాయి. దీదీ ప్రచార బృందంలో రాజ్‌ చక్రవర్తి, సోహమ్‌ చక్రవర్తి, మిమి చక్రవర్తి, శ్రీకాంతో మెహతా, హిరన్‌ చటర్జీ, యష్‌ దాస్‌ గుప్తాతో పాటు ఫుట్‌ బాల్‌ ఆటగాడు బైచుంగ్‌ భుటియా వంటి స్టార్‌ ప్రచారకులూ వున్నారు.

బెజవాడలో మీ దందా నిజం కాదా..?

గతంలో సిబిఐ కేసు నుంచి తప్పించుకొనేందుకే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య టిడిపిలో చేరారని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షులు రాజీవ్‌ రతన్‌ విమర్శించారు. విజయవాడలో ఆయన సిఐగా పనిచేస్తూ పాల్పడిన దందా అందరికీ తెలుసని, అలాంటి వ్యక్తి తమ నేత సి రామచంద్రయ్యపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. 

వారికి భారీ మూల్యం తప్పదట..!

‘పనామా పత్రాల్లో’ 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లుగా వెల్లడైన నేపథ్యంలో.. ఓ బహుళ సంస్థల దర్యాప్తు బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విదేశాల్లో అక్రమ ఖాతాలను కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

రోజువారీ వేతనం180/- నుంచి 194/-

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) కింద వేతనాన్ని రోజుకు రూ.180 నుంచి రూ.194కు పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

బలవంతపు భూ సేకరణ ఆపాలి.

సబ్బవరం మండలం వంగలి సర్వేనెంబర్‌ 109, 135, 240, 241, 242లోగల అసైన్డ్‌ భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్‌ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన భూహక్కుదారుల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హక్కుదారులలో కొంతమందికి ఐదు ఎకరాల సాగు భూమి ఉండగా 2, 3 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మరికొంత మంది హక్కుదార్ల పేర్లు జాబితాలో లేవన్నారు.

లక్షల తలలు నరికేసే వాళ్లం:రాందేవ్

‘భారత్‌ మాతాకీ జై’ నినాదంపై వివాదంలో యోగా గురు రామ్‌దేవ్‌ బాబా మరింత ఆజ్యం పోశారు. తమకు దేశ రాజ్యాంగంపై గౌరవముందని, లేదంటే ఆ నినాదాన్ని చేయననే లక్షల మంది తలలు నరికేసే వాళ్లమని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

నల్లధనుల లిస్ట్ బయటపెట్టిన పనామా

పనామా పేపర్‌ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివిధ దేశాలకు చెందిన నేతలు సెల్రబిటీల పేర్లు ఈ జాబితాలో ఉండటమే దీనికి కారణం. పన్ను ఎగవేతకు పాల్పడిన వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులు, బార్సిలోనా ఫార్వర్డ్‌ లియోనెల్‌ మెస్సీ, దాదాపు 1.15 కోట్ల రికార్డులున్న ఈ పత్రాలలో 2.14 లక్షల మంది విదేశృ ప్రముఖుల పేర్లున్నాయని ఐసిఐజె వివరించింది. ఈ పత్రాలు పనామాకు చెందిన న్యాయవ్యవహారాల సంస్థ మొస్సాక్‌ఫొనెస్కా నుండి లీకయినట్లు తెలుస్తోంది. 

పెట్రోల్‌పై రూ 2.19,డీజిల్‌పై 98 పైసలు..

సోమవారం రాత్రి పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచుతున్నట్లు కేంద ప్రభుత్వం ప్రకటించింది. లీటర్‌ పెట్రో ల్‌పై రూ 2.19 పైసలు పెరగ్గా, లీటర్‌ డీజిల్‌ పై 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోలు ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.

మార్క్సి‌స్టు‌ దృక్కోణం - కులం

దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపై హిందూత్వ శక్తుల దాడుల నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేధావుల్లో ఒక నూతన చర్చ మొదలైంది. కుల అణచివేత సమస్యను మార్క్సి స్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. నేడు జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాతిక ఎజెం డాలో భాగమైన విషయాన్ని కాదనలేము.

Pages

Subscribe to RSS - 2016