2016

దివీస్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

- ముగ్గురు కార్మికులకు గాయాలు
- ఆందోళనలో కార్మికులు, స్థానికులు
- సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సిపిఎం, సిఐటియు నేతలు 
- దివీస్‌ ప్రమాదఘటనపై సమగ్రదర్యాప్తు సిపిఎం, సిఐటియు డిమాండ్‌ 

ఫ్లైఓవర్‌ అవినీతి, నారద టేపుల స్కామ్‌..

 బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సిపిఐ(యం), కాంగ్రెస్‌ ఆ పనిలోనే వున్నాయి. ఫ్లైఓవర్‌ అవినీతి, నారద టేపుల స్కామ్‌ అస్త్రాలతో ప్రచారం చేస్తున్నాయి. అయితే తృణమూల్‌ అవినీతి పాపం ప్రధానమైనదే అయినప్పటికీ ... తమ ఎన్నికల ప్రచార అంబుల పొదిలో మరిన్ని పదునైన అస్త్రాలున్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి, పారిశ్రామికీకరణ లేమి, క్షీణిస్తున్న శాంతిభద్రతలు వంటి పలు అంశాలకు కూడా సమానమైన ప్రాధాన్యతనిస్తామంటున్నారు. 

రూ.1,80,000 కోట్ల అవకతవకలు..

 కాంగ్రెస్‌, అవినీతి పర్యాయ పదాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ ఎద్దేవా చేశారు. అస్సాంలోని బోర్ఖెత్రే నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భారీ అవినీతి జరిగిందని, రూ.1,80,000 కోట్లకు అవకతవకలు జరిగినట్లు కాగ్‌ ఎత్తిచూపిందని పేర్కొన్నారు. నిధుల ఖర్చుకు సంబంధించిన వినియోగపత్రాలు ఇవ్వాలని కాగ్‌ కోరితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఇవ్వడం లేదని విమర్శించారు.

బీహర్ మద్య నిషేధంపై పిల్

 బీహర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యనిషేధంపై A.N సింగ్ అనే వ్యక్తి పాట్నా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశాడు. 
ఈ నిషేధం మనిషి తినే తిండి, తాగే అలవాట్లను అరిస్తుందని పెర్కొన్నాడు. రాజ్యాంగంలోని అరిక్టల్ 14,19,21,22 లకు ఈ చర్య వ్యతిరేకమని పెర్కొన్నాడు. దీనిపై విచారణకు కోర్టు సమయం కేటాయించవలసి ఉంది.

రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్‌ కొత్త నాటకం..

 ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ సంతకాల సేకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని, పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ముస్లిం మైనార్టీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే చూసిందని తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. అధికారంలో ఉండగా సచార్‌ కమిటీ సిఫార్సులను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు

విద్యార్థులపై రాజద్రోహం కేసు..

పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలతో తుముకూర్‌లో ఇద్దరు విద్యార్థులపై అధికారులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే తాము ఎలాంటి దేశ వ్యతిరేక నినాదాలూ చేయలేదని తమపై దాడిచేసిన ఏబీవీపీ సభ్యులే అక్రమంగా కేసు నమోదు చేయించారని బాధిత విద్యార్థులు పేర్కొన్నారు.

IT పెట్టుబడులకోసం ఛలో సింగపూర్..

ఏపీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, నారాయణ మూడు రోజులపాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకూ వారి పర్యటన వున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఐటీ రంగంలో పెట్టుబడుల విషయంపై పలు కార్యక్రమాల్లో పాల్గొని మంత్రులు చర్చించనున్నారు.

తాగునీటి సమస్యపై దృష్టేదీ?

రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో విజయవాడలో జరి గిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తీర్మానాలను రాష్ట్ర కార్యదర్శి పి. మధు మంగళవారం నెల్లూరులో విడుదల చేశారు. నిజాలను కప్పిపుచ్చి సమస్యలను పక్కదారిపట్టించేలా బూటకపు ప్రచా రాలకు దిగుతున్న ప్రభుత్వ తీరును సీపీఐ(ఎం) తీవ్రంగా విమర్శించింది. రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నా తగిన సహాయ చర్యలు చేపట్టలేదని ఆ పార్టీ పే ర్కొంది. వివిధ రంగాల కార్మికులు తమ సమస్యల పరి ష్కారానికి ఉద్యమబాట పట్టారని ఆందోళన వ్యక్తం చేసింది.

భారత ప్రధాని పాక్ కు లొంగిపోయారు

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడిని పరిశోధించడానికి పాకిస్థాన్‌ బృందాన్ని ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోడీ భారత్‌మాతాకు వెన్ను పోటు పొడిచారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.  దేశ సమగ్రతను అవమాన పర్చిన మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రధాని పాకిస్థాన్‌కు లొంగిపోయారని విమర్శించారు. గత 65 సంవత్సరాల కాలంలో ఏ ప్రధాని కూడా ఇలాంటి ఘోర తప్పిదానికి పాల్పడలేదని అన్నారు.

బడ్జెట్‌ సమావేశాల్లో GSTఆమోదం..

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (రెండో విడత) ఈ నెల 25 నుంచి ప్రారంభమవనున్నాయి. మే 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో జీఎస్‌టీ సహా పలు కీలక బిల్లులు ఆమోదానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.కీలకమైన జీఎస్‌టీ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉందని, ఇందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయన్న నమ్మకం తమకుందని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.

Pages

Subscribe to RSS - 2016