2016

HCU పరిస్థితులపై రాష్ట్రపతితో ఏచూరి భేటీ

హెచ్ సీయూలో తాజా పరిస్థితులపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి... రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. హెచ్ సీయూలో వేముల రోహిత్‌ ఆత్మహత్య, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలను రాష్ట్రపతికి వివరించారు. గత నెల 17 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను ప్రణబ్‌ దృష్టికి తెచ్చారు. హెచ్‌సీయూ ఘటనలపై జోక్యం చేసుకోవాలని కోరారు. హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ హిందూ రాష్ట్ర అభివృద్ధి మంత్రిత్వ శాఖగా మారకుండా చూడాలని సీతారాం ఏచూరి విన్నవించారు. 

2018 డిసెంబర్‌ నాటికి AP అసెంబ్లీ..

అమరావతి రాజధాని నగర తొలి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. నేచర్‌, కల్చర్‌, ఫ్యూచర్‌ అనే మూడు కీలకాంశాల ఆధారంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రణాళికను ఎంపిక చేశారు. తొలిదశలో ఐకానిక్‌ నిర్మాణాలుగా ఈ రెండింటినీ చేపట్టనున్నారు. 3.50 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ, తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మాణాలను చేపట్టానున్నారు. వీటికి సుమారు రూ.720 కోట్లు వ్యయం అంచనా వేశారు. ప్రతి నిర్మాణంపైనా సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ భవనాన్ని 210 కుర్చీల సామర్థ్యంతో నిర్మించను న్నారు. ఇది ఉద్దండ్రాయునిపాలెం వద్ద నిర్మాణమ వుతుంది.

అమరావతి భూసేకరణపై అసెంబ్లీలో రచ్చ

ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఎపి సర్కార్ జీవో నెంబర్ 110 ను విడుదల చేసింది ఏపీ రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను జీవో 110 ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జీవో ద్వారా 99 ఏళ్ల వరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు.

పన్ను మదింపుపై దర్యాప్తు జరపాలి

నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నుల మదింపులోనూ, డివిజన్ల ఏర్పాటులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ నోటీసులు ఇవ్వకుండా అపరాధ రుసుము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పన్నుల తగ్గింపునకు కృషి చేస్తానని, అపరాధ రుసుము కట్టనవసరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు కూడా ప్రజల పక్షాన ఉండి పన్నులు తగ్గింపునకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.

రాజధానిలో సి.పి.ఎం.నేతల‌ అక్రమ అరెస్టుల‌కు నిరసనగా విజయవాడ సి.ఆర్‌.డి.ఏ. కార్యాయం వద్ద ధర్నా

తాత్కాలిక సచివాల‌య నిర్మాణ పనులను ముఖ్యమంత్రి శుక్ర‌వారం పరిశీలించనున్న నేపథ్యలో ముందస్తుగానే సిపిఎం రాజధాని ప్రాంత నాయకు లు ఎం.రవి, జె.నవీన్‌ప్రకాష్‌ల‌ను అరెస్టు చేసి, నిర్భందించడాన్ని నిరసిస్తూ  విజ‌య‌వాడ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో లెనిన్‌ సెంటర్‌లోని సి.ఆర్‌.డి.ఏ కార్యాయం వద్ద ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నాయకుల‌ను వెంటనే విడుద చేయాల‌ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా  సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి ప్రజారాజధాని నిర్మిస్తామని చెబుతూనే ప్రజపై నిర్భంధ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

స్మార్ట్‌ సిటీ ఫీజు - పిపిపి పేర ప్రాజెక్టులు ప్రైవేటీకరణ నిధులన్నీ స్మార్ట్‌ ఏరియాకి తరలింపు

స్మార్ట్‌సిటీ వలన కలిగే ప్రయోజనాలకు ప్రతి ఫలంగా జివిఎంసి ఆస్ధిపన్నుపై 10 శాతం అదనంగా స్మార్ట్‌సిటీ ఫీజు వసూలు  చేయాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ప్రతిపాదను నగర టాక్స్‌ పేయర్స్‌కు తీవ్ర హాని చేస్తుందని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. స్మార్ట్‌సిటీలో అనేక ప్రాజెక్టులను పిపిపి పేర అధికార పార్టీ నాయకులు బినామీ సంస్థలకు ధారాదత్తం చేయుటకు పలు  ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ స్కీము క్రింద మంజూరయ్యే నిధులన్నీంటిని స్మార్ట్‌ ఏరియా ప్రాంతమైన ఆర్‌.కె బీచ్‌ ఏరియాకి మల్లించే ప్రతిపాదను చేశారు.

విశాఖలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభ, భారత రాజ్యాంగం- పౌరహక్కులు అనే సెమినార్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

    ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కు సంఘం రాష్ట్ర మహాసభలు  మార్చి 27వ తేదీన విశాఖనగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం - పౌరహక్కులు  అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్‌ జరుగుతుంది. ఈ సెమినార్‌ను జయప్రదం చేయాలని ఈ రోజు (24-03-2016) పోస్టర్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ఆవిష్కరణలో విశాఖ బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు  కె.ఎస్‌. సురేష్‌ కుమార్‌, ఐలూ నాయకులు ఎన్‌. హరినాధ్‌, ఎ.కె.ఎన్‌ మల్లేష్‌, ఐ.ఎ.ఎల్‌ నాయకులు వెంకటేశ్వరరావు, సాయికుమార్‌ లు  పాల్గొన్నారు.  ఈ సందర్బంగా వారు ప్రసంగించారు.

విషం చిమ్ముతున్న దివిస్‌

 పరిశ్రమలొస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్న మాటలు భ్రమలు కల్పించేవి తప్ప భరోసా ఇచ్చేవి కావని అర్థమవుతోంది. నమ్మించి పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చడం కోసం ప్రజలతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలని అనుభవాలు చెబుతున్నాయి.

బాక్సైట్‌పై చంద్రబాబు కపటనాటకం

       విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్‌కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

Pages

Subscribe to RSS - 2016