2016

ఢిల్లీలో వెంకయ్య..బెజవాడలో బాబు

ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మూడు నామాలు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హోదాపై ఢిల్లీలో వెంకయ్య నాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామా చేశారన్నారు. కేంద్రం నుండి టీడీపీ బయటకు రావాలని నారాయణ డిమాండ్ చేశారు

ఒబామాతో ప్రధాని మోదీ భేటీ

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు.. లావోస్‌ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

అసెంబ్లీలో ‘ప్రత్యేక హోదా’ వేడి

ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన తర్వాత సభలోకి వచ్చిన వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. వైకాపా ఆందోళనపై స్పందించిన ఆర్థికమంత్రి యనమల ప్రత్యేక హోదా అశంపై సీఎం ప్రకటన చేస్తారని.. ఆ తర్వాత జరిగే చర్చలో పాల్గొనాలని స్పష్టం చేశారు.

ప్యాకేజీపై ప్రభుత్వం తర్జనభర్జనలు..

ఏపీ ప్రత్యేక హోదా..ప్యాకేజీపై బుధవారం అర్ధరాత్రి కేంద్రం చేసిన ప్రకటనపై ఏ స్టేట్ మెంట్ చేయాలనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రకటనపై ఎలా స్పందించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.

కేంద్రం వైఖరికి నిరసనగా..

ప్రత్యేక హోదాపై చేతులేత్తిసిన కేంద్రంపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. తొలి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి.రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి.

ప్రత్యేక హోదాకై బంద్ కు పిలుపు

ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని..నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తరువాత దృష్టి సారిస్తే రైల్వే జోన్ ప్రకటించాలి..ఉక్కు పరిశ్రమ ప్రకటించాలి కదా అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ..గిరిజన యూనివర్సిటీ పెద్ద వాటిని పక్కన పెట్టి చిన్న చిన్న వాటివి కల్పిస్తారా ? అని నిలదీశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి బంద్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

ఎ.పికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ నిర‌స‌న‌లు

ఎ.పికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ నిర‌స‌న‌లు...అ్ర‌క‌మ అరెస్టులు
ఆంద్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ రాష్ట్రంలో నిర‌స‌న‌లతో హోరెత్తుతుంది. తిరుప‌తిలో సిపియం, సిపిఐ, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌ ద‌గ్గ‌ర ధ‌ర్న, 64 మంది అరెస్టు.

బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి:మధు

ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని..నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి బంద్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

విలువలతో కూడిన విద్య నేటి అవసరం

స్వాతంత్య్రోద్యమంలో మహా నాయకులు తమ పుట్టినరోజులను సామాజిక ఆశయాలతో ముడిపెట్టుకున్నారు. పుట్టిన రోజును కొత్త తీర్మానాలు చేసుకొనేదిగా నిర్ణయించుకున్నారు. కొత్త ఆశయాలకు కంకణబద్ధులై అందుకు ప్రణాళిక రచించుకొనే రోజుగా మార్చుకొని రాజీలేని పోరాటం చేశారు. కాబట్టే సెప్టెంబర్‌ 5న భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని యావత్‌ భారతావని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటోంది. 'విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఉపాధ్యాయుల దిశానిర్దేశం లేకపోతే విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరమే అనేందుకు మరో మాటలేదు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే..

దివీస్ ఫార్మాకు వ్యతిరేకంగా పోరు

ఈస్ట్ గోదావరి జిల్లా తొండంగి మండలం పంపాజీపేటలో దివీస్ భూ సేకరణకు వ్యతిరేకంగా నేడు సీపీఎం బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టింది. దీనితో పలువురు సీపీఎం నేతలను గృహ నిర్భందం చేశారు. సీపీఎం జిల్లా కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, దేవిరాణి, వేణుగోపాల్‌ను అరెస్ట్‌ చేశారు. పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మధు మండిపడ్డారు.

Pages

Subscribe to RSS - 2016