2016

కేంద్రం అమెరికాను అనుసరిస్తోంది..

భారతదేశం కూడా అమెరికా విధానాలనే అమలు చేస్తోందని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్‌ విమర్శించారు. ప్రణాళికా సంఘం(ప్లానింగ్‌ కమిషన్‌) ఎత్తివేతే దీనికి నిదర్శనమన్నారు. అక్టోబర్‌ 14 నుంచి సంగారెడ్డిలో జరగనున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల నేపథ్యంలో విలేకర్లతో వారు మాట్లాడారు. అమెరికాలో ప్లానింగ్‌ కమిషన్‌ ఉండదనీ, ఇక్కడ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రణాళిక లేకుండా అభివృద్ధి ఎలా సాధిస్తామనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

కాశ్మీర్‌ ప్రస్తావనపై భారత్‌ ఆగ్రహం

ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ ప్రస్తావించడం పట్ల భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్‌పై లేని ఆధిపత్యానిన చలాయించేందుకే పాకిస్తాన్‌ ఈ అనవసర పటాటోపాన్ని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్‌ విమర్శించారు. తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ ఇలా అంతర్జాతీయ వేదికను ఉపయోగించు కోవడమంటే దాన్ని దుర్వినియోగం చేయడమేనని భారత్‌ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగ మేనని మరోసారి పునరుద్ఘాటించింది.

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు ఆందోళనలకు దిగారు.ఆందోళన చేస్తున్న వారికి వామపక్ష పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు పెల్లుబికాయి.

ఆక్వాఫుడ్‌పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా

తుందుర్రులో పోలీసుల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. ఆక్వాఫుడ్‌పార్క్‌ గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన అఖిలపక్షనేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆక్వాఫుడ్‌ పార్క్‌ పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది.

అర్ధ‌రాత్రి సిపియం నాయ‌కుల అర‌స్టుల ప‌ర్వం

  వెంక‌య్య నాయుడు తిరుప‌తికి వ‌స్తున్న సంద‌ర్భంగా రాష్ట్ర‌నికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేసాడ‌ని శ‌నివారం ఉద‌యం  నిర‌స‌న కార్యక్ర‌మం త‌ల‌పెట్టారు. ఆ కార్య‌క్ర‌మాన్ని జ‌ర‌గ‌నీయ‌కుండా చేయ‌డానికి అర్థ రాత్రి నుంచి  సిపియం నాయ‌కుల అర‌స్టుచేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

వరద బాధితులకు సహాయం

గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో  రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు  సిపిఎం  సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో  భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు. 

చిరువ్యాపారులు జీఎస్టీకి వెలుపలే..

దేశవ్యాప్తంగా ఏకరీతి పన్నుల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన జీఎస్టీ అమలుకు సంబంధించి మరో కీలకమైన ముందడుగు పడింది. వార్షిక టర్నోవర్‌ రూ.20లక్షల లోపు ఉండే చిరు వ్యాపారులను వస్తుసేవల పన్ను (జీఎస్టీ)కి వెలుపలే ఉంచే విషయంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అలాగే వ్యాపార పరిధిని అనుసరించి ఆయా డీలర్లు/వ్యాపారులపై అజమాయిషీ ఎవరిది ఉండాలనే అంశంలోనూ చాలా వరకు స్పష్టత వచ్చింది.

ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలి

మన ప్రజాస్వామ్యపు గొప్పతనాన్ని కాపాడుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ రాసిన ‘సిటిజన్‌ అండ్‌ సొసైటీ’ పుస్తకం ఆవిష్కరణ రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. అనేక సమస్యలున్నా సమాజానికి దారి చూపగల శక్తి దేశానికి ఉందని మోదీ అన్నారు. అన్సారీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. 

Pages

Subscribe to RSS - 2016