2016

అవినీతి కేసుల్లో దర్యాప్తు ఆపొద్దు

అవినీతికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ‘ఓటుకు కోట్లు’కేసులో హైకోర్టుకు నివేదించారు. అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఉందని, దాని అధికారాలను హరించే హక్కు ఈ కోర్టుకు లేదని వివరించారు.

ట్రంప్ విజయం..భారత్పై ఎఫెక్ట్..

గత ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుడటంతో, భారత్తో ఉన్న ట్రేడ్ డీల్స్పై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రొగ్రామ్ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి భారీగా నష్టపోనుంది.

సంస్కరణలు కొనసాగిస్తాం :జైట్లీ

భారత ఆర్థిక వ్యవస్థలో తలుపులు మరింత బార్లా తెరవాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం కోసం, మౌలిక లోటును పూడ్చడం కోసం సంస్కరణలను మరో అడుగు ముందుకు వేయించనున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌-బ్రిటన్‌ టెక్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ఆర్థిక వృద్ధి విస్తృతమయ్యే కొద్దీ రక్షణాత్మక విధానాలను అవలంబించే వాళ్లు కూడా తగ్గిపోతారన్నారు..

 

పెద్దనోట్ల రద్దుపై హైకోర్టులో వ్యాజ్యం

కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి వీలు కలిగిస్తున్న ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌తో పాటు దాని ఆధారంగా జారీచేసిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరుతూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్రిటీష్‌ కాలంలో ఏర్పడిన ఆర్‌బీఐ చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం కొందరికి ముందే తెలుసునని.. దీనివల్ల సామాన్యులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

మోదీది లెక్కలేనితనం : రాహుల్

రూ.500,1000 నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సాధారణ ప్రజల పట్ల ప్రధాని మోదీది లెక్కలేనితనమని ఆయన విమర్శించారు. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, చిన్న దుకాణదారులు, గృహిణులు అష్టకష్టాలు పడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. 

అనంత‌లో జ‌న‌సేనా పార్టీ స‌భ‌...

జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న‌ కరువుపై పవన్ కల్యాణ్ స్పందించనున్నారు. 

అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎన్నిక

అమెరికా అధ్య‌క్ష రేసుకు రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా పోటీప‌డ్డ ట్రంప్ అనూహ్య రీతిలో అధ్యక్ష పీఠాన్ని గెలుచుకున్నారు. 45వ అమెరికా దేశాధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌య్యారు. జ‌న‌వ‌రి 20వ తేదీని ఆయ‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలున్నాయి.

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

సర్వేల అంచనాలను తలదన్నేలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దూకుడు, రాత్రికి రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం భారత స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా కుదేలైంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. 

ఈ పాపం ఎవరిది?

'ఒక ర్యాంకు ఒకే పింఛను' (ఓఆర్‌ఓపి) అమలు కోసం రిటైర్డు ఆర్మీ సుబేదార్‌ ఆత్మహత్య, తదనంతర పరిణామాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. జై జవాన్‌ అని నినదించిన గడ్డపైనే దేశానికి సేవ చేసిన జవాన్లు అత్యంత దయనీయమైన రీతిలో తనువు చాలించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి చనిపోయిన రిటైర్డు సుబేదార్‌ మానసిక స్థితి ఏమిటో మొదట పరిశీలించాలని వికె సింగ్‌ వంటి మంత్రులతో ప్రకటనలు ఇప్పించడం అత్యంత గర్హనీయం.

Pages

Subscribe to RSS - 2016