2016

ప‌రిశ్ర‌మ‌ల కాలుష్యం భారీ నుండి త‌ణుకు ప‌ట్ట‌ణాన్ని గోస్త‌నీ న‌దిని కాపాడాల‌ని కోరుతూ...సి ఎం కి సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. మ‌ధు లేఖ‌

మరో వంచన..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామీణ భారత ప్రజానీకం ఆర్థికంగా చితికి శల్యమైపోతోంది. పెద్ద నోట్ల రద్దు ఆకస్మిక నిర్ణయానికి నల్లధనం, ఉగ్రవాదం రూపుమాపడమే లక్ష్యమని చెబుతున్న పాలకులు అటువైపు గురి పెట్టకుండా బడుగు జీవులపై సర్జికల్‌ దాడులు చేస్తుండటం దారుణం. ఇప్పటికే ముందస్తు ప్రణాళికేదీ లేకుండా రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేయడం మూలాన భారతావని పీకల్లోతు చిల్లర కష్టాల్లో మునిగి మూలుగుతుంటే అది చాలదన్నట్టు బ్యాంకుల్లోనూ పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేయడం వంచనకు పాల్పడటమే.

నగదు కొరత మరో ఐదు మాసాలు..

 ఇప్పట్లో నగదు కొరత తీరే అవకాశాలు కానరావడం లేదు. మరో ఐదు నెలల వరకు ఇదే దుస్థితి కొనసాగనుందని స్వయంగా బ్యాంకింగ్‌ సంఘాలు పేర్కొంటున్నాయి. వచ్చే నాలుగైదు మాసాలు ఇదే నగదు కొరత ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. దేశంలోని నాలుగు ముద్రణాలయాలు పూర్తి స్థాయిలో పనిచేసినా, ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదన్నారు. వచ్చే నెలలో ఉద్యోగుల వేతనాలకు సమస్యలు ఏర్పడతాయని చెప్పారు

రెండు రకాల 500 నోట్లు చెల్లుతాయి..!

రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త నోట్లను యుద్ధప్రాతిపదికన ముద్రించి అన్ని బ్యాంకులకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొత్త రూ. 500 నోటు రెండు వర్షన్లలో ముద్రితమై బయటకు వచ్చేసింది. అది చూసి కొందరు వినియోగదారులు ఏది అసలో, ఏది నకిలీనో అని ఆందోళన చెందుతున్నట్లు వార్తలు రావడంతో బ్యాంకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.రెండు రకాల నోట్లూ చెల్లుతాయని ఆందోళన వద్దని తెలిపింది. ఈ రెండు సెట్ల మధ్య ఉన్న తేడాలేంటంటే.. గాంధీజీ చిత్రం నీడ, జాతీయ చిహ్నం చోటు మారడం, రంగులో కొద్దిగా తేడా, బోర్డర్‌ సైజ్‌ తేడా.

మోడీ క్షమాపణ చెప్పాలి..

నల్లధనానికి ప్రతి పక్షాలు మద్దతిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల్ని పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఖండించాయి. మోడీ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాయి. 

కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలి..

ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న 4,534 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడుకు శుక్రవారం లేఖ రాశారు. జిఒ 142, 143ల ద్వారా 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్‌ నియామకంతో ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయని తెలిపారు

Pages

Subscribe to RSS - 2016