2016

సమస్యలతో సతమతం

నగరంలో సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రెండో రోజుకు చేరుకున్నాయి.. నాయకులు వీధివీధికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారులకు సమస్యలు అనేక సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని, అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ తమ కాలనీల్లో తొంగి చూడట్లేదని వారు పాదయాత్ర బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పారిశుధ్యం, రోడ్లు, మురుగు కాల్వలు, మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉపాధిని చూపి వలసలను అరికట్టాలి : సిపిఎం

గ్రామాల్లో వెంటనే కూలిపనులు లేని పేదలందరికీ ఉపాధి హామీ పనులు చూపించి వలసలను అరికట్టాలని సిపిఎం పార్టీ డివిజన్‌ కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజు సత్తెనపల్లి మండలంలోని కట్టావారిపాలెం, పెదమక్కెన, గుడిపూడి, నందిగం, భీమవరం గ్రామాల్లో సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులు లేకపోవడంతో పస్తులు ఉండాల్సి వస్తుందని, తమకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చూపించాలని గ్రామస్తులు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. పెదమక్కెనలోని ఎస్సీకాలనీవాసులు రాజకీయ కక్ష్యతో దళితులకు ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఇవ్వలేదన్నారు.

200 కుటుంబాలకు 40 ఏళ్లుగా స్థలాల్లేవు

రేపల్లె డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రేపల్లెలో సోమవారం ప్రారంభమయ్యాయి. యాత్రను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బిఎల్‌కె.ప్రసాదు ప్రారంభించగా జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌ మాట్లాడారు. పట్టణంలో అనేక సమస్యలున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, ఒకటో వార్డు రెండో వార్డు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం 14 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా నేటికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. సిసి రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క ప్రభుత్వ కుళాయి కూడా లేదని అన్నారు.

బాబు పాలనలో ఎక్కడి సమస్యలక్కడే,- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పి.మధు నిశిత విమర్శ

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఏ సమస్యా పరిష్కారం కాలేదని, ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌లో ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రారంభ సభకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, ఎం.పకీరయ్య అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన ప్రభుత్వం వారి నుంచి భూములను సమీకరించి ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మురికివాడల్లో సమస్యల తిష్ట సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నగరంలో మురికివాడల్లో సమస్యలు తిష్ట వేశాయని, టిడిపి తన ఎన్నికల వాగ్దానాలు మరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. 24వ తేదీ వరకు నగరంలో సిపిఎం నిర్వహించే పాదయాత్రలు ఆదివారం సంగడిగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్‌ వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో పాశం రామారావు మాట్లాడుతూ టిడిపి తన మ్యానిఫెస్టోలో పేదలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇస్తామని రెండున్నరేళ్ల పరిపాలనలో ఒక్క సెంటు కూడా పంపిణీ చేయలేదన్నారు. నగరంలో 35 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల సమస్య ఉందన్నారు.

కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు.

విదేశాలకు 2 లక్షల 76 వేల కోట్లు.!!

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా బ్లాక్‌ మనీ ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. గతంలో రూ. 96 వేల కోట్ల మేర విదేశాలకు తరలిపోతే.. ఈ ఏడాది రూ. 2 లక్షల 76 వేల కోట్లు బయటకు పోయిందని ఆయన అన్నారు. మోదీ అనుభవరాహిత్యమే దీనంతటికీ కారణమని ఉండవల్లి విమర్శించారు.

సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై..

పెద్ద నోట్లను రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై శివసేన మండిపడింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ సామాన్యులపై కాదని.. స్విస్ బ్యాంకుపై చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 

ఛానెళ్ల నవీకరణ నిబంధనల సడలింపు

టీవీ ఛానెళ్ల వార్షిక నవీకరణ నిబంధనలను సరళీకరించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. వారు నిర్ణీత గడువుకు 60 రోజుల ముందుగా వార్షిక అనుమతి రుసుము చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. దీనినే ఒక ఏడాది కాలపరిమితికి ప్రసారాల కొనసాగింపునకు అనుమతిగా పరిగణిస్తారన్నారు.

Pages

Subscribe to RSS - 2016