2016

సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఎన్నిక చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన ఎంపిక తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆయన కేవలం మాలమహానాడు అధ్యక్షుడు మాత్రమేనని, ఆయనను ఇలాంటి కమిషన్‌కు ఎంపిక చేయడం ఏంటన్న వాదనలు వినిపించాయి. 

ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకోను

ఈ ఏడాదికి గానూ ఉత్తమ జర్నలిస్టులకిచ్చే ప్రతిష్టాత్మక రామ్‌నాథ్‌ గోయంకా అవార్డును ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా తీసుకునేందుకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా జర్నలిస్టు అక్షయ ముకుల్‌ తిరస్కరించారు. ముకుల్‌కు నాన్‌ ఫిక్షన్‌ బుక్స్‌ విభాగంలో రామనాథ్‌ గోయంకా అవార్డు లభిం చింది. హిందూత్వ సైద్ధాంతిక పునా దులపై ఈ పుస్తకం వెలువడింది. అయి తే అవే సిద్ధాంతాలతో ప్రధాని రాజకీ యాలు సాగుతున్న క్రమంలో ము కుల్‌ అవార్డుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కారవాన్‌ వెబ్‌సైట్‌తో జర్నలిస్టు సందీప్‌ భూషణ్‌ చెప్పారు.

JNU ఉద్యమాన్ని ఉధృతం చేయండి

జేఎన్‌యూలో అదృశ్య మైన విద్యార్థి నజీబ్‌ అహ్మద్‌ను వెతికిం చడంలో జేఎన్‌ యూ వీసీ అలసత్వం ప్రదర్శి స్తున్నారని ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తో సహా పలువురు వక్తలు ఆరోపించారు.జేఎన్‌యూ వెలుపల మీ ఆందోళనను కొనసాగించండి' అని విద్యార్థులకు కేజ్రీవాల్‌ సూచించారు. 'ఇండియా గేట్‌ వద్ద కూర్చోండి. నజీబ్‌ కోసం పోరాడేందుకు యావత్‌ దేశ మద్దతు కోరండి. నేను మీతో ఉన్నాను. ఆందోళనలో నేను కూడా భాగస్వామి అవుతాను' అని కేేజ్రీవాల్‌ అన్నారు.

ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా..

తూర్పుగోదావరి జిల్లా తొండంగి ప్రాంతంలో దివీస్‌ కంపెనీకి బలవంతంగా భూములు సేకరించడాన్ని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు ఈరోజు విశాఖలోని జీవీఎంసీ గాంధీ వగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భూసేకరణ జరిపి రైతులను ఒత్తిడికి గురి చేస్తున్నా్నరని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి వాటిని ప్రైవేటు కంపెనీలకు అక్రమంగా కట్టబెడితే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వం దివీస్‌ కంపెనీకి తొత్తుగా వ్యవహరిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందని ఆరోపించారు.

స్పష్టత లేని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఎలాంటి స్పష్టత లేకుండా ముగిసింది. దీంతో పెండిగ్‌ సమస్యలపై నెల 20న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. జీఎస్టీకి సంబంధించి ఇప్పటివరకు 10 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు.

సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

మధ్యప్రదేశ్‌లోని జైలు నుంచి తప్పించుకున్న ఎన్‌కౌంటర్‌కు గురైన సిమి ఉగ్రవాదుల ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టీస్ ఎస్‌కే పాండే ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతుందని గురువారం రాత్రి వెల్లడించిన అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

కాలుష్యంపై ఎన్‌జీటీ సీరియస్

దేశ రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్య తగ్గింపుకై చేపడుతున్న చర్యల పట్ల ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పదేళ్లకు మించిన వాహనాలను నిలిపివేసి.. కాలుష్య నియంత్రణకు సమగ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

కేజ్రీవాల్‌, రాహుల్‌ అరెస్టుపై ఏచూరి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అరెస్ట్‌ చేయటం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికర సంకేతాలను పంపుతున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి విమర్శించారు. మాజీ సైనికులు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ (ఓఆర్‌ఓపీ) విధానంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసగా మాజీ సైనికుడు రామ్‌కిషన్‌ గ్రేవల్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం ఇక్కడి కళామందిర్‌లో జరిగిన అబ్దుల్‌ హలీమ్‌ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఏచూరి మాట్లాడారు.

Pages

Subscribe to RSS - 2016