2016

విలీన మండలాల సమగ్రాభివృద్ధిని కోరుతూ పాదయాత్ర..

ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణంపై సమావేశాలు ఏర్పాటు చేస్తారేగానీ ముంపు మండలాల గిరిజనుల ఘోష మాత్రం పట్టించుకోవడం లేదు. 2018 లోగ పోలవరం పూర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం ఏడుమండలాల ప్రజలకు ప్యాకేజి,పునరావాసం కల్పించకుండా వారిని జలసమాధి చేయాలని చూస్తోందని విలీన మండలాల సమగ్రాభివృద్ధి కొరకు చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర సర్కార్ పై మండిపడిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు తదితరులు..

దివీస్ ఫార్మా కంపెనీని తొలిగించాలి..

తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్‌ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ద‌ళిత‌, మ‌త్స్య‌కారుల సమస్యలపై పాదయాత్ర

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా క‌నిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల స‌మ‌స్య‌ల‌పై సీపీఎం ఉద్య‌మం ప్రారంభించింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల సాధ‌న కోసం పాద‌యాత్ర సాగిస్తోంది. కాకినాడ‌లో ఇంద్ర‌పాలెం వంతెన వ‌ద్ద ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్ర‌ను ప్రారంభించారు. ద‌ళిత సంఘాల నేత‌లు రామేశ్వ‌ర రావు సహా ప‌లువురు మ‌ద్ధ‌తు తెలిపారు.న‌గ‌రంలోని ద‌ళిత‌, మ‌త్స్య‌కార పేట‌ల్లో పేరుకుపోయిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని నేత‌లు డిమాండ్ చేశారు.

ఉగ్రవాదానికి మూలాలెక్కడ ?

ఉరి ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదం పై చర్చ సాగుతుంది. కాశ్మీర్‌ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భక్తి పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్జికల్‌ దాడుల తరువాత ఆ ఘనత తమదేనని లాభాల వేట మొదలయ్యింది. పనిలో పనిగా ఏదేశ వస్తువులు కొనాలో, వద్దో చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో సాగినట్టుగానే ఉగ్రవాద విషయం లోనూ వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.

సిపిఎంపై ఆరెస్సెస్‌ తప్పుడు ప్రచారం

కేరళ ఉత్తర ప్రాంతంలో హింసారాజకీయాలకు పాల్పడుతున్న ఆరెస్సెస్‌ తమ కార్యకర్తలను సిపిఎం హత్య చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయటం విడ్డూరంగా వుందని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కార్యకర్తలపై సిపిఎం దాడులు చేస్తోందంటూ తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఆరెస్సెస్‌ అఖిల భారత కార్యకారి మండల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో తప్పుపట్టింది. వాస్తవ పరిస్థితులకు, తీర్మానానికి భారీ వ్యత్యాసం వుందని తెలిపింది.

అమెరికా ఆంక్షలకు భయపడం

రష్యా ప్రభుత్వాన్ని బెదిరించేందుకు అమెరికా ఆంక్షల ఆస్త్రాన్ని ప్రయోగించిన పక్షంలో వాటిని ఎదుర్కొనేందుకు తమ దేశం అన్ని విధాలా సంసిద్ధమై ఉందని మాస్కో ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ఆర్ధిక శాఖ డిప్యూటీ మంత్రి సెర్జీ ర్యబ్‌కోవ్‌ తమ ప్రభుత్వ సన్నద్ధతను వెల్లడిస్తూ అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తమ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను సిద్ధం చేస్తున్నారని, అమెరికా స్పందనకు తగినట్టుగా రష్యా కూడా ప్రతిస్పందన చర్యలు తీసుకోగలదని ఆయన స్పష్టంచేశారు. 

Pages

Subscribe to RSS - 2016