2016

భూ నిర్వాసితులకు అండగా..

జిల్లాలో సోలార్‌ప్లాంట్‌ నిర్మాణం కోసం రైతుల భూములు లాక్కోవడం దారుణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు అన్నారు. కర్నూలు జిల్లాలోని ప్లాంట్‌ నిర్మాణం జరగబోయే గ్రామాల్లో ఆయన పర్యటించారు. పంట భూముల్లో ప్లాంట్‌లు నిర్మించి, ఎవరిని ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులకు న్యాయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభత్వంపైనే ఉందని చెప్పారు. 

హిందూత్వ హింస, దోపిడీకి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌వాదం

నేడు దేశవ్యాప్తంగా హింస, సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ మతం పేరుతో జరుగుతున్నాయి. దేశం ఆర్థికంగా కుంగిపోవ డానికి, సమాజం నేరస్థంగా మారడానికి కారణం హిందూవాదమే. హిందూవాదం హింసావాదం, అణచివేతవాదం, అమానవవాదం. హిందూత్వ పేరిట నేడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌ మైనార్టీలు, దళితులపై జరుపుతున్న దాడులు మోడీ జీవన శైలిలో ఉన్న పయోముఖ విషకుంభత్వాన్ని బయట పెడుతున్నాయి.

టెలికం కంపెనీల ‘షేరింగ్’ రూట్

టెలికం కంపెనీలు అదనపు వ్యయ భారం లేకుండా ఇచ్చి పుచ్చుకునే విధానంలో కవరేజీ సేవలు మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా నెట్‌వర్క్ షేరింగ్ కోసం చేతులు కలుపుతున్నాయి. వొడాఫోన్, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో టై అప్ అయిన మరుసటి రోజే రిలయన్స్ జియో సైతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం చేసుకుంది. 

బాబు డెరైక్షన్.. కాంగ్రెస్ యాక్షన్

తెలంగాణ  సాగునీటి ప్రాజెక్టులు అడ్డుకునే కుట్రలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు డెరైక్షన్ మేరకే.. ఇక్కడి కాంగ్రెస్ నేతలు యాక్షన్ చేస్తున్నారని రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులను ఆపాలని టీడీపీ ఫిర్యాదు చేస్తే.. వారితో చెట్టాపట్టాలేసుకొని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి వంటి నేతలు ధర్నాలకు దిగడమే ఇందుకు నిదర్శనమన్నారు.

అణచివేతలు చెల్లవు : సిపిఎం

చంద్రబాబు ప్రజలపై అణచివేత చర్యలకు, నిర్బంధానికి పాల్పడుతున్నారని, మరింత పెద్ద ప్రజాఉద్యమంతో వాటిని ఎదుర్కొంటామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందన్నారు. తుందుర్రు - కంసాలి బేతపూడి మధ్య ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. 30 నుంచి 40 గ్రామాల ప్రజలు ఆధారపడిన గొంతేరు కాలువను ఆక్వా ఫుడ్‌ పార్కు పూర్తిగా కలుషితం చేస్తుందన్నారు. స్థానికులు రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. 

Pages

Subscribe to RSS - 2016