గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 7న జరిగే చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి కోరారు. ఈసందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈనెల 7న చలో ఐటిడిఎ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత దుర్మార్గంగా లక్షల మంది గిరిజనులను, ఇతర పేదలను జలసమాధి చేయడానికి పూనుకున్నా యన్నారు. 12 ఏళ్లుగా 12 గ్రామాలకు పునరావాసం కల్పించలేని ప్రభుత్వం 2018 నాటికి 400 గ్రామాలకు పునరావాసం ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.