2016

కావేరి వివాదంపై మోదీస్పందన..

కావేరి నదీ జలాల వివాదంపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇరురాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని, సామాజిక బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు

సీపీఎం నేతల ఆత్మీయ సమావేశం

విశాఖపట్టణంలో సీపీఎం నేతల ఆత్మీయసమావేశం జరిగింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల సీనియర్ సీపీఎం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిలో సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ.రాఘవులతో పాటు సీనియర్ నేత చౌదరీ తేజేశ్వరావు, సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు నర్సింగరావు, సీపీఎం నేతలు పుణ్యవతి, ఎంవీఎస్.శర్మ ఉన్నారు. ఎమర్జెన్సీ రోజుల నుంచి విద్యార్ధి , కార్మిక, వామపక్ష ఉద్యమంలో పాలుపంచుకున్న మిత్రులందరం ఓసారి కలుసుకుని ఆ పాత జ్ఞాపకాలను పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సీపీఎం పొలిట్ బ్యూరోసభ్యులు బీవీ రాఘవులు తెలిపారు.

ప్యాకేజీ పేరుతో భ్రమలు:ఏచూరి

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భ్రమలు కల్పిస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రత్యేక హోదా కాకుండా ఇంకేదీ అవసరం లేదనీ, ప్యాకేజీ పేరుతో భ్రమలు సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీని ఎందుకు నిలుపుకోవడం లేదో కేంద్రం చెప్పాలన్నారు.

ఆక్వా ఫుడ్ పార్క్ ,దివీస్ కు వ్యతిరేకంగా పోరాడుతాం

 కాకినాడలో దివీస్ పెట్టవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.దివీస్ కంపెనీకి భూములు ఇవ్వని రైతులపై కిరాతకంగా దాడులు చేయడం దారుణమన్నారు. సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వచ్చే భూములకు మూడు లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదని తెలిపారు.రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని ఎద్దేవా చేశారు. తుండూరు ఆక్వాఫుడ్‌ పార్క్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ ఈజెడ్ ల పేరుతో 37 వేల ఎకరాల భూమిని సేకరించారని.. అందులో 1 శాతం భూమి కూడా వినియోగంలోకి రాలేదన్నారు.

ఏపీ హోదాపై ప్రజా బ్యాలెట్..

ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు మంగళం పాడి.. ఓ బోగస్ ప్యాకేజీని సీఎం చంద్రబాబు స్వాగతించారంటూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు.విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాన్ని బయట పెట్టేందుకు ప్రజా బ్యాలెట్‌ను నిర్వహించన్నుట్లు చెప్పారు.

ప్ర‌త్యేక హూదాలో అరెస్టుల ప‌ర్వం

చిత్తూరు జిల్లాలో ప్ర‌త్యేక హూదా కోసం జ‌రిగిన బంద్‌లో 144 సెక్ష‌న్  క్రింద సిపియం పార్టీ,  ప్ర‌జాసంఘాల నాయ‌కుల‌ను అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Pages

Subscribe to RSS - 2016