2016

ఆర్‌ఎస్‌ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు

గోవా ఆర్‌ఎస్‌ఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోవా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ సుభాష్‌ వోలింగ్‌కర్‌ను తొలగించడంతో సంక్షోభం ముదిరింది. సుభాష్‌కు మద్దతుగా 4 వందల మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు రాజీనామాలు చేశారు. తనను పదవి నుంచి తప్పించడం వెనక కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారీకర్‌ హస్తముందని సుభాష్‌ వోలింగర్‌ ఆరోపిస్తున్నారు. 

ఈ రెండేళ్లు సరిపోలేదా..? : రామకృష్ణ

విభజన హామీలు నెరవేర్చడానికి రెండేళ్లు సరిపోలేదా అని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.లోటు బడ్జెట్ కూడా పూడ్చని కేంద్రం.... ప్రత్యేక హోదాకి సమానంగా నిధులు ఇస్తామంటే ఎలా నమ్మాలని అన్నారు. 

ఓటుకు నోటు కేసులో సుప్రీంకు వెళ్తాం

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటీషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టంగా తీర్పులిచ్చానా వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్టే విధించిందని పిటీషనర్‌ తరపు లాయర్ అన్నారు. సమగ్ర వివారలతో కూడిన కౌంటర్‌ దాఖలు చేస్తామన్నారు.

విద్యాసంస్థల్లో భారత్‌కు చివరి స్థానం

ఆసియాలోనే అత్యంత ఇన్నోవేటివ్‌ విశ్వవిద్యాలయాల్లో చైనా, భారత్‌ల కంటే చిన్న దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియాల విద్యాసంస్థలు అగ్రపథాన నిలిచాయి.రాయిటర్స్‌ విడుదల చేసిన తొలి 75 ఆసియా అత్యంత నవ్యపథ విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్‌కు దక్కింది చిట్టచివరిలోని 72, 73 స్థానాలు(ర్యాంకులు). 

15 ఏళ్ల తరువాత వియాత్నం కు

వియత్నాంలో భారత ప్రధాని పర్యటించనుండటం గత 15 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. వియత్నాం నుంచి మోదీ చైనాలోని హాంగ్‌ఝౌకు శనివారం బయలుదేరి వెళ్తారు. ఈ నెల 4, 5వ తేదీల్లో అక్కడ జరగనున్న ‘జి-20’ సదస్సులో పాల్గొంటారు.

బెదిరింపులు లెక్కచేయని ఉద్యోగులు

కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఉద్యోగులు శుక్రవారం సంపూర్ణంగా సమ్మె నిర్వహించారు. రిజర్వ్‌ బ్యాంక్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గన్నారు. నాబార్డ్‌ ఉద్యోగులు కూడా పాల్గని సమ్మెను విజయవంతం చేశారు.పశ్చిమ బెంగాల్‌లో స్థానిక యంత్రాంగం, పోలీసుల నుండి బెదిరింపులు ఎదురైనప్పటికీ బ్యాంకు, నాబార్డ్‌ ఉద్యోగులు వాటిని లెక్క చేయక సమ్మెలో పాల్గని జయప్రదం చేశారు

చంద్రబాబుకు హైకోర్టులో వూరట

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో వూరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి విచారణ కోసం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించించిన హైకోర్టు విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది.

Pages

Subscribe to RSS - 2016