రెండు రకాల 500 నోట్లు చెల్లుతాయి..!

రద్దు చేసిన పెద్ద నోట్ల స్థానంలో కొత్త రూ.2000, రూ.500 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త నోట్లను యుద్ధప్రాతిపదికన ముద్రించి అన్ని బ్యాంకులకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొత్త రూ. 500 నోటు రెండు వర్షన్లలో ముద్రితమై బయటకు వచ్చేసింది. అది చూసి కొందరు వినియోగదారులు ఏది అసలో, ఏది నకిలీనో అని ఆందోళన చెందుతున్నట్లు వార్తలు రావడంతో బ్యాంకు ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.రెండు రకాల నోట్లూ చెల్లుతాయని ఆందోళన వద్దని తెలిపింది. ఈ రెండు సెట్ల మధ్య ఉన్న తేడాలేంటంటే.. గాంధీజీ చిత్రం నీడ, జాతీయ చిహ్నం చోటు మారడం, రంగులో కొద్దిగా తేడా, బోర్డర్‌ సైజ్‌ తేడా. ప్రజలకు కొత్త నోట్లను త్వరగా అందుబాటులోకి తెచ్చే యత్నంలో ఇలా జరిగినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి.