
ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావించడం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాశ్మీర్‌పై లేని ఆధిపత్యానిన చలాయించేందుకే పాకిస్తాన్ ఈ అనవసర పటాటోపాన్ని ప్రదర్శిస్తోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ విమర్శించారు. తన సొంత ప్రయోజనాల కోసం పాకిస్తాన్ ఇలా అంతర్జాతీయ వేదికను ఉపయోగించు కోవడమంటే దాన్ని దుర్వినియోగం చేయడమేనని భారత్ పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగ మేనని మరోసారి పునరుద్ఘాటించింది.