2015

సింగపూర్‌ షరతులు..!

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకే అప్పగించాలంటే అందుకు ప్రతిగా అవి వాటికోసం కోరుకున్న భూములనూ సర్వ హక్కులతోనూ ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. కంపెనీల షరతులు:తమకు కేటాయించే భూములపై పూర్తి హక్కులూ తమకే అప్పగించాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని రాజధాని నిర్మాణం చేపట్టదలచిన కంపెనీలు తెలిపినట్లు తెలిసింది. 99 సంవత్సరాల లీజు పద్ధతిలో ఇచ్చినా భూమిపై హక్కులు తమకే ఉండాలని, అందుకు అవసరమైన డాక్యుమెంట్లున్నీ అప్పగించాలని సింగపూర్‌ ప్రతినిధులు షరతు పెట్టినట్లు సమాచారం.

అసెంబ్లీ ముట్టడి:APరైతుసంగం

 రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజుకొని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురువారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరుతో 53 వేల ఎకరాలు సేకరించాలని 45 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని కోసం మొత్తం 1.40 లక్షల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

ప్రపంచీకరణ నేప థ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిళ్ల వల్ల 1991 నుంచి పాలకవర్గాలు అవలంబిస్తున్న సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుం చీ కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యంచేయటానికి కృషి జరుగుతున్నది. వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మిక వర్గం ఇప్పటికే 15 సార్లు సార్వత్రిక సమ్మెలు చేసి, ఈ విధానాలను తాము తుదికంటా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రయివేటీక రణ, సరళీకరణ విధానాల అమలు వేగం తగ్గింది. అయినా వాటి అమలు కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

జిఓ20ని రద్దు చేయాలి: SFI

రాయలసీమ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న జిఒ నంబరు 120ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌లో సర్కిల్‌లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని పద్మావతి యూనివర్శిటీ వైద్యకళాశాలలో సీమ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20శాతం సీట్లు ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వం కొత్తగా జిఒ నంబరు 120 తీసుకు వచ్చి లోకల్‌కు 20శాతం, నాన్‌లోకల్‌కు 80శాతం సీట్లు కేటాంచే విధంగా అవకాశం కల్పించారని విమర్శించారు.

వృద్ధి రేటుకు కోతలు..

పారిశ్రామికోత్పత్తిలో క్షీణత, పెట్టుబడుల్లో స్తబ్దత నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలకు గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీలు కోత పెట్టాయి. ప్రజల కొనుగోలు శక్తిలో పెద్ద మార్పులు లేకపోవడం, ఉత్పత్తులకు డిమాండ్‌ లేకపోవడంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును 7 శాతానికి అంచనా వేశాయి. ఇది వరకు ఈ వృద్ధి రేటును 7.5 శాతంగా ఉంటుందని పేర్కొన్నాయి. వచ్చే మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.1 శాతానికి పరి మితం కావచ్చని యుబిఎస్‌, 7 శాతానికి తగ్గొచ్చని మూడీస్‌ సంస్థలు వేరు వేరుగా వెల్లడించాయి.

చంద్రబాబుది హోల్‌సేల్‌ దోపిడీ..

 రాష్ట్రంలో చంద్రబాబు హోల్‌సేల్‌గాను, దిగువ స్థాయి నాయకులు రిటైల్‌గాను దోపిడీ చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనా టిడిపి రౌడీలు దౌర్జన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లా డుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిసుంటే రూ. 2 లక్షల కోట్లు నిధులు ఎపికి వచ్చే ఉండేవన్నారు. ఎపి విభజనతో రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు రావాల్సి ఉంటే, సిఎం తన ఆత్మగౌరవం తాకట్టు పెట్టి భిక్షం ఎత్తుకొంటున్నారని ఎద్దేవా చేశారు. 

పర్యాటక ప్రాజెక్టుల కోసం భూసేకరణ..

కేంద్ర పర్యాటకా ప్రాజెక్టుల కోసం ధరణికోట సత్తెనపల్లి రోడ్డులో ప్రభుత్వం 50 ఎకరాల భూ సేకరణ చేపడుతుందనే వార్తల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన నెలకొంది.. నవ్యాంధ్ర రాజధానిగా తుళ్లూరును ప్రకటించడంతో అమరావతిలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల ధరలు ఎకరం సుమారు రూ.4 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రభుత్వం భూ సేకరణ ద్వారా భూములు తీసుకుంటే 30 లక్షల కంటే మించి పరిహారం వచ్చే అవకాశాలు లేకపోవడంతో భూ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సమ్మెతో కార్పొరేట్‌ పాలకులకు సమాధానం..

  కార్పొరేట్‌ పాలకులైన బిజెపి, టిడిపిలు కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి, ఉరికొయ్యలు, చెరసాలలు, ఆత్మబలిదానాలతో సాధించు కున్న కార్మిక చట్టాలను సవరించి, కార్పొరేట్‌ సంస్థలు, యాజ మాన్యాలు మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేస్తున్నాయి. కార్మిక చట్టాల సవరణ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే... ఎటువంటి హక్కులూ, రక్షణా లేని కార్మికునిగా మార్చడం. కార్పొరేట్‌ పాలకులు కార్మిక వర్గానికి బానిస సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Pages

Subscribe to RSS - 2015