వృద్ధి రేటుకు కోతలు..

పారిశ్రామికోత్పత్తిలో క్షీణత, పెట్టుబడుల్లో స్తబ్దత నేపథ్యంలో భారత వృద్ధి రేటు అంచనాలకు గ్లోబల్‌ రేటింగ్‌ ఎజెన్సీలు కోత పెట్టాయి. ప్రజల కొనుగోలు శక్తిలో పెద్ద మార్పులు లేకపోవడం, ఉత్పత్తులకు డిమాండ్‌ లేకపోవడంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును 7 శాతానికి అంచనా వేశాయి. ఇది వరకు ఈ వృద్ధి రేటును 7.5 శాతంగా ఉంటుందని పేర్కొన్నాయి. వచ్చే మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.1 శాతానికి పరి మితం కావచ్చని యుబిఎస్‌, 7 శాతానికి తగ్గొచ్చని మూడీస్‌ సంస్థలు వేరు వేరుగా వెల్లడించాయి. వరుసగా పడిపో తున్న తయారీ రంగం ఉత్పత్తికి తోడు వరుసగా తొమ్మిది మాసాలుగా క్షీణిస్తోన్న ఎగుమతులు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు పెట్టుబడుల్లో స్తబ్దత, మాంద్యం భయాలు వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయని విశ్లేషకులు, రేటింగ్‌ ఎజెన్సీలు భావిస్తోన్నాయి.