2015

ప్రత్యేక హోదాకై జరిగే బంద్‌లో వామపక్షపార్టీ నాయకుల‌ అరెస్టుకు సిపియం ఖండన.

రాష్ట్ర విభజన సందర్భంగా బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయల‌సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల‌కు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకేంద్రంగా రైల్వేజోన్‌ వంటివి అనేక వాగ్ధానాలు ఇచ్చింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బిజెపి మాటతప్పింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి ప్రభుత్వం చెపుతుంటే కేంద్రంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై అఖిల‌పక్షాల‌ మద్దతు తీసుకొని ఒత్తిడి తేవడంలో విఫల‌మయ్యింది.

విద్యకు మలాలా ప్రతీక:AIDWA

 'నా రెక్కలు విరవని నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు' అని చెప్పిన స్వేచ్ఛాజీవి, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌ జారు మహిళా విద్యకు, ప్రపంచశాంతికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. మలాలాను, ఆమె తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. స్థానిక వింజనంపాడులోని కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సంయుక్తంగా కళాశాలలో శుక్రవారం మలాలా స్వీయ గాధను తెలియచేస్తూ ' నేను మలాలా' పేరుతో ముద్రించిన పుస్తకాన్ని వేలాది మంది విద్యార్థులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కళాశాల చైర్మన్‌ కోయ సుబ్బారావు అధ్యక్షత వహించారు.

AP ప్రత్యేకహోదాపై ఏచూరి

కేంద్రానికి  ప్రత్యేకహోదా ఇచ్చే లక్షణాలు కనపడటం లేదని, అటువంటి ఆలోచన కూడా ఉన్నట్లు లేదని అన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఇటువంటి సమ స్యలన్నింటిని పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలని తాము ఆనాడు కోరినా.. పట్టించుకోలేదని  సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

 

CPM అగ్రనేతలపై దాడులు..

వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, వరదల వల్ల నష్టాలపాలైన రైతులకు పరిహారం చెల్లించాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని, భూసేకరణ ఆర్డినెన్స్‌ విరమించుకోవాలని తదితర 17 డిమాండ్లతో వామపక్ష రైతు సంఘాలు గురువారం నాడు 'చలో సచివాలయం' కార్యక్రమాన్ని చేపట్టాయి.ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంలో అందెవేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా మరోసారి పైశాచికానికి పాల్పడింది.సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రశాంతంగా నిర్వహిస్తున్న ప్రదర్శనపైకి పోలీసులను ఉసిగొల్పి నెత్తుటేరుల్లో ముంచింది. దీంతో కొల్‌కతా నగర వీధులు రణరంగంగా మారాయి.

గ్రామ‌కంఠాల స‌ర్వే‌పై ఆగ్రహం

ప్రభుత్వం చేసే మోసకారి పనులు ఇప్పుడిప్పుడే నూతన రాజధానిగా ప్రకటించిన అమరావతి 29 గ్రామాల్లో ప్రజలకు అర్థమవుతున్నాయి. తమ ప్రభుత్వం అని నమ్మి భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం గ్రామకంఠాల విషయమై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వారిలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. గ్రామాల్లో మంత్రులను మేళతాళాలతో ఊరేగించిన ప్రజలే ఇళ్లల్లో పెట్టి కదలడానికి వీల్లేదని నిర్బంధిస్తున్నారు. గ్రామకంఠాల విషయమై ఎటూ తేల్చకపోతే ప్రభుత్వ వ్యవహారాన్ని తేలుస్తామని తెగేసి చెబుతున్నారు.

CRDA కార్యాలయానికి తాళాలు..

ఏపీ రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణను వెంటనే విరమించుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్రకార్యవర్గ సభ్యుడు బాబురావు డిమాండ్ చేశారు. గ్రామ కంఠాల పరిధిని విస్తరింపచేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. సీఆర్డీఏ కార్యాలయాన్ని రైతు సంఘాలు, సీపీఎం నేతలు ముట్టడించారు. సీఆర్డీఏ కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. 140 ఎకరాలు ప్రభుత్వ కార్యాలయాలకు సరిపోతుందన్నారు. కానీ రాజధాని పేరుతో ఇప్పటికే లక్షాపదివేల ఎకరాల సమీకరించారని అది చాలదని ఇప్పుడు మరో 3వేల ఎకరాలను సేకరిస్తోందని బాబురావు మండిపడ్డారు.

పొంచివున్న విద్యుత్‌ ఛార్జీల ముప్పు

ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఐదేళ్ళ బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తామనడం సబబు కాదు. ఇప్పుడు 2009-10 నుంచి 2013-14 వరకు ఎపిఇపిడిసిఎల్‌ రూ.1,158 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.6,051 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీలు ప్రతిపాదించారు. రెండు డిస్కాంల వాదనల్లో అనేక అంతరాలు, అసంగతాలు ఉన్నాయి. ఇఆర్‌సి అనుమతించిన దానికంటే తక్కువ విద్యుత్‌ను సరఫరా చేశారు. అలాగే కొనుగోలు చేసిన విద్యుత్‌ పరిమాణం కూడా తక్కువే. (పరిస్థితి ఇలావుండగా రానున్న ఐదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన గాల్లో మేడలు కట్టడమే కదా!) అయినా ఖర్చు మాత్రం చాలా పెరిగిందని డిస్కాంలు వాదిస్తున్నాయి.

ఉల్లిపాయలు కౌంటర్లు పెంచాలి, ప్రతీ కుటుంబానికి కనీసం 4కేజీలు ఇవ్వాలి - సిపియం డిమాండ్

విశాఖనగరంలో ఉల్లిపాయలు ధరలు పెరగడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కేవలం రైతు బజార్లలో మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఉల్లిపాయ‌లు సరఫరా చేస్తున్నది. తక్కువ కౌంటర్ల వల‌న ప్రజానీకం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రోజువారి కూలిని కూడా కోల్పోతున్నారు. తక్షణం ప్రతి రైతుబజారులో కనీసం ఐదు కౌంటర్లు ప్రారంభించాలి. ప్రతి రేషన్‌డిపోలోనూ, మున్సిపల్‌ వార్డు ఆఫీస్‌ల‌ వద్ద సబ్సిడీ ఉల్లిపాయల‌ను సరఫరా చేయాల‌ని సిపియం పార్టీ కోరుచున్నది. ప్రస్తుతం త్లెరేషన్‌కార్డుదారుల‌కి మాత్రమే ప్రభుత్వం ఉల్లిపాయులు సరఫరా చేయడం చాలా అన్యాయం. వివక్షత కూడా.

కార్మిక చట్టసవరణలు సహించం.

కార్మిక సంఘాలు, కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సాధించు కున్న కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు అన్నారు. పోరాటాల ఫలితంగా 44 కార్మిక చట్టాలు సాధించుకున్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 11 రాష్ట్రాలలో కార్మిక చట్టాలలో సవరణలు చేసింది. దేశవ్యాప్తంగా చట్టాల్లో సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో పాలిషింగ్‌ యూనిట్‌లలో పనిచేసే కార్మికులు 70 వేల మంది ఉన్నారు. కార్మిక చట్టాలలో సవరణ చేస్తే 30 వేల నుంచి 40 వేల మంది కార్మికులు హక్కులను కోల్పోతారు.

Pages

Subscribe to RSS - 2015