October

ప్రత్యేకసబ్‌ప్లాన్‌ ఏది?జమలయ్య

ప్రభుత్వం చేనేత పార్కులను ఏర్పాటు చేసి చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించాలని ఎపి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఎపి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కార్యదర్శి జెఎన్‌ శేషయ్య అధ్యక్షత జరిగిన ధర్నాలో జమలయ్యతోపాటు, కార్మికుల ఆందోళనకు మద్దతు పలుకు తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్‌ కూడా మాట్లా డారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. జిల్లాలో 15 వేలకు మందికిపైగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని తెలిపారు.

భోగాపురంలో నకిలీ నాటకం

భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణకు అధికారులు సరికొత్త తంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారు. రైతులపై ఒత్తిడి పెంచడానికి 'నకిలీ' నటకానికి తెరలేపారు. వ్యవసాయం చేయని, హక్కుదారులుగా ఉన్న కొంత మంది మత్స్యకారుల డి-పట్టా భూములు తీసుకొని భూసేకరణ జరిగిపోతుందన్న భ్రమలు కల్పిస్తున్నారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు 9రెవెన్యూ గ్రామాల్లో 5311ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జారీచేసి 30రోజులు ముగిసిపోతున్నా...ఆందోళనల ఫలితంగా అధికారులు బాధిత గ్రామాల్లో అడుగు పెట్టలేక పోతున్నారు. దీంతో అధికారులు వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్టు ప్లాన్‌లో లేని గ్రామాలను ఎంచు కున్నారు.

భూ సమీకరణపై మైండ్ గేమ్..

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ఇంకా కొనసాగుతోంది. 95 శాతం మంది భూములివ్వగా ఐదు శాతం మందే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నదీ తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోనూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తం 37,724 వేల ఎకరాల పట్టా భూమి సమీకరించాలని నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇందులో 31,359 ఎకరాలకే అంగీకార పత్రాలిచ్చారు. అందులోనూ 29,854 ఎకరాలకే హక్కుదారులను నిర్థారించారు. ఇందులో 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. కానీ మంత్రులు మాత్రం ఇప్పటికి మొత్తం భూమికి ఒప్పంద పత్రాలు అందాయని చెబుతున్నారు.

ఉడతకేల ఊర్లో పెత్తనం..

వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారులను విమర్శిస్తూ కాశీకి బయలుదేరినట్లుగా ఈనెల 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెను విమర్శిస్తూ పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు దేశభక్తి తమకే ఉన్నట్లు నీతి వాక్యాలు బోధిస్తున్నాయి. పాలకుల పంచన చేరిన బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు (కార్పొరేట్లు) దేశ ఆర్థిక వ్యవస్థకు సమ్మె వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంటున్నారు. దేశభక్తుల ఇంటికి, తమకు తడికే అడ్డం అన్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. భారత్‌కు వ్యాపార నిర్వహణకు అనుకూలంగా ఉన్న దేశం అనే మంచి పేరు పోతుందని ఆవేదన వ్యక్త పరిచారు. ఇంతటితో ఆగకుండా దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు.

Pages

Subscribe to RSS - October