October

నేతిబీరలో నెయ్యి - కార్పొరేట్‌ సామాజిక భద్రత

సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను రూపుమాపే లక్ష్యం తోనే 'సామాజిక బాధ్యత' అనే అం శం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది అధికారం లో ఉన్న పాలకవర్గాలే. దాని కోసమే 'సంక్షేమ రాజ్యం' అనే భావన వాడుకలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి ప్రభు త్వాలు వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్‌ సంస్థలకు ఆ బాధ్యతలను బదలాయిస్తున్నాయి. ఈ మార్పిడి సత్ఫలితా లనిస్తుందని పాలకవర్గాలు ఆశిస్తున్నాయి.

కాయకల్ప చికిత్స..

రెపో రేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయని చాలామంది ఆశిస్తున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించడంతో పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఈ దిశలోనే స్పందించింది. బుధవారం ఉదయం నుండి ఏ మాత్రం తడబాటు లేకుండా మార్కెట్‌ సూచీ పైకే ప్రయాణం చేయడం రిజర్వు బ్యాంకు నిర్ణయానికి సానుకూల స్పందనే! అయితే, అరశాతం రెపో రేటు తగ్గిచడంతోనే బ్రహ్మాండం బద్దలవుతుందని భావించడం సబబుకాదు. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి.

పెంచినజీతాలఅమలుఏదీ?:CITU

పెంచిన జీతాలు, ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల మున్సిపల్‌ కార్మి కులు ధర్నాలు నిర్వహించారు. విశాఖలో జివిఎంసి కార్యా లయం వద్ద మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేపట్టారు. కనీస వేతనం రూ.11వేలు అమలు చేయాలని, ప్రతి నెలా 5వ తేదీకే వేతనాలు చెల్లించాలని, గుర్తింపు యూనియన్‌ 41 ప్యాకేజీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు.

కార్మికహేళన పాలన:నర్సింగరావు

 విశాఖ జిల్లాలోని పలు ప్రయివేటు పరిశ్రమల్లో ప్రమాదాల పరంపర కొనసాగుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌. నర్సింగరావు విమర్శించారు. తెలుగుదేశం పాలన పూర్తిగా కార్మిక హేళనకు మచ్చుతునకగా ఉందని అన్నారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 28న గంగవరం పోర్టులోనూ, పరవాడ ఫార్మాసిటీ సాయినార్‌ కంపెనీల్లోనూ ప్రమాదాలు జరిగి ముగ్గురు కార్మికులు మరణించారని తెలిపారు.

APకి ప్రత్యేక హోదా ఇవ్వాలి:CPM

రాయలసీమ అభివృద్ధికి రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నూలు జిల్లాలో చేపట్టిన సిపిఎం జీపుజాతా బుధవారం నంద్యాల, గాజులపల్లె, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో బిజెపి అగ్రనాయకులు వెంకయ్యనాయుడు ఎపికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేకహోదా గురించి పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.

దేశంలోఫాసిస్టుపోకడలు:MAబేబీ

భారతదేశంలో ఉన్నది పాసిస్టు ప్రభుత్వం కాకపోయినా పాసిస్టు పోకడలు కనిపిస్తున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆలిండియా విప్స్‌ సదస్సులో పాల్గొనటానికి విశాఖ వచ్చిన బేబీ బుధవారం సిపిఎం విశాఖ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన చర్చాగోష్టిలో పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలు అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అగ్రవర్ణాల సహకారంతో బడుగు, బలహీన వర్గాలను అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు.

ప్రత్యేకసబ్‌ప్లాన్‌ ఏది?జమలయ్య

ప్రభుత్వం చేనేత పార్కులను ఏర్పాటు చేసి చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించాలని ఎపి చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ పి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఎపి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నేత కార్మికులు ధర్నా చేశారు. కర్నూలు జిల్లా కార్యదర్శి జెఎన్‌ శేషయ్య అధ్యక్షత జరిగిన ధర్నాలో జమలయ్యతోపాటు, కార్మికుల ఆందోళనకు మద్దతు పలుకు తూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్‌ కూడా మాట్లా డారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. జిల్లాలో 15 వేలకు మందికిపైగా చేనేత వృత్తిపై ఆధారపడ్డారని తెలిపారు.

భోగాపురంలో నకిలీ నాటకం

భోగాపురం ఎయిర్‌పోర్టు భూసేకరణకు అధికారులు సరికొత్త తంత్రాంగాన్ని ప్రయోగిస్తున్నారు. రైతులపై ఒత్తిడి పెంచడానికి 'నకిలీ' నటకానికి తెరలేపారు. వ్యవసాయం చేయని, హక్కుదారులుగా ఉన్న కొంత మంది మత్స్యకారుల డి-పట్టా భూములు తీసుకొని భూసేకరణ జరిగిపోతుందన్న భ్రమలు కల్పిస్తున్నారు. భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు 9రెవెన్యూ గ్రామాల్లో 5311ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జారీచేసి 30రోజులు ముగిసిపోతున్నా...ఆందోళనల ఫలితంగా అధికారులు బాధిత గ్రామాల్లో అడుగు పెట్టలేక పోతున్నారు. దీంతో అధికారులు వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్టు ప్లాన్‌లో లేని గ్రామాలను ఎంచు కున్నారు.

భూ సమీకరణపై మైండ్ గేమ్..

రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ఇంకా కొనసాగుతోంది. 95 శాతం మంది భూములివ్వగా ఐదు శాతం మందే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నదీ తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోనూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తం 37,724 వేల ఎకరాల పట్టా భూమి సమీకరించాలని నోటిఫికేషన్‌ ఇవ్వగా ఇందులో 31,359 ఎకరాలకే అంగీకార పత్రాలిచ్చారు. అందులోనూ 29,854 ఎకరాలకే హక్కుదారులను నిర్థారించారు. ఇందులో 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. కానీ మంత్రులు మాత్రం ఇప్పటికి మొత్తం భూమికి ఒప్పంద పత్రాలు అందాయని చెబుతున్నారు.

Pages

Subscribe to RSS - October