October

శంకుస్థాపనకి రూ400 కోట్లా?:మధు

 నల్లపాడులో నిరవధిక దీక్ష చేపట్టిన వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన దీక్షకు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు మద్దతు తెలియజేసారు .. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. చంద్రబాబు.. రోజు వారి ఉపన్యాసాలు వింటుంటే నిజాయితీ నశించిందని అనిపిస్తోందన్నారు. ప్రత్యేక హోదా కాదు...ప్యాకేజీలున్నాయని ఇప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. కనీస నిజాయితీ లేదని, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో నిజాయితీ లేదని విమర్శించారు. పీఆర్సీ 2013 అమలు జరగాల్సి ఉంటే 2014 నుండి అమలు చేస్తామని తెలిపారు.

ప్రజారోగ్యం పట్టని ప్రభుత్వం:కాశీనాథ్

విజయవాడలో డెంగ్యు , విషజ్వరాలతో ప్రజలు భాధ పడుతున్నా పాలకవర్గానికి  చీమకుట్టినట్లయినా లేదని సిపిఎం విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ ఘాటుగా విమర్శించారు.సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కార్పోరేషన్ కార్యాలయం వద్ద ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు..

 జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది.

జాతీయ కమిషన్కు ఐద్వా లేఖ

పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అక్టోబర్‌ 1న జరిపిన లాఠీచార్జ్‌ విషయంలో ఐద్వా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ మహిళా కమిషన్‌కు ఐద్వా లేఖలు రాసింది. కోల్‌కతా జిల్లా లెఫ్ట్‌ఫ్రంట్‌ కమిటీ ఆధ్వర్యంలో లాల్‌బజార్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించగా పోలీసులు అకారణంగా లాఠీచార్జ్‌ చేశారన్నది తెలిసిందే. ఈ లాఠీచార్జ్‌లో చాలా మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఐద్వా ఈ లేఖలలో వివరించింది. ఐద్వా అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి జగ్మతి సంగ్వాన్‌లు ఈ లేఖలను మీడియాకు విడుదల చేశారు.

ఇక్కడే పుట్టాం..ఇక్కడే చస్తాం

దాద్రీ ఘటన నేపథ్యంలో ఊరు విడిచి వెళ్లే ఆలోచన ఏదీ లేదని అఖ్లాక్‌ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. బిషారా విడిచి వెళుతున్నట్లు వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు. 'మేము ఎక్కడి కీ తరలివెళ్లలేదు. వెళ్లము. దీనికి సంబంధించి వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యానికి గురయ్యాను' అని అఖ్లాక్‌ తనయుడు సర్తాజ్‌ వ్యాఖ్యానించారు. 'గ్రామం విడిచి వెళ్లడంపై మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది మా సొంత ఊరు. మాతృభూమి. మేము ఇక్కడే పుట్టాం. ఇక్కడే తుది శ్వాస విడుస్తాం. మేమెందుకు గ్రామం విడిచివెళ్లాలి' అని సర్తాజ్‌ ఆవేదనతో వ్యాఖ్యానించారు. 

విభజనపై ఆరా తీయండి:ఉండవల్లి

రాజ్యాంగం, పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఉభయ సభల ఆమోదం పొందిందా? లేదా? అన్న విషయమై సమగ్రమైన ఆరాతీసి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. 2014 ఫిబ్రవరి 18న ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తీరును కూలంకషంగా పరిశీలిస్తే బిల్లు చట్టసభల అనుమతి పొందలేదని ధ్రువపడుతుందని ఆయన చెప్పారు. 

ఆధార్‌పై సుప్రీం నిర్ణయం..

ప్రజాపంపిణీ వ్యవస్థ, వంటగ్యాస్‌లకు మాత్రమే ఆధార్‌ వినియోగాన్ని పరిమితం చేస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించడానికి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై శుక్రవారం సాయంత్రంలోపు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు గురువారం కేంద్రానికి, సెబీ, ఆర్‌బిఐ తదితర సంస్థలకు హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని విచారిస్తున్న సుప్రీం బెంచ్‌కు నేతృత్వం వహిస్తోన్న ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తు మాట్లాడుతూ తనకు శుక్రవారం సాయంత్రం వరకు సమయం ఇవ్వండి. అప్పటిలోగా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

గోవధ అంశంపై ముస్లింనేతపై దాడి

జమ్మూ కాశ్మీర్ : ఇండిపెండెంట్ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ పై అధికార కూటమిలోని బీజేపీ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు.శ్రీనగర్ ఎమ్మెల్యేల హాస్టల్ లో రషీద్ కొందరికీ 'బీఫ్' పార్టీ ఇచ్చారనే ఆరోపణలున్నాయి. గో మాంసంపై నిషేధం అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవలే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రషీద్ పలు వ్యాఖ్యాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి ఆగ్రహానికి గురైన కాషాయ దళం ఆయనపై దాడికి దిగారు. 

కలం యోధుల కలత..

పెచ్చుమీరుతున్న మతతత్వ శక్తుల ఆగడాలపై కలం యోధులు కలత చెందుతున్నారు. కేంద్రం ప్రకటించిన అరుదైన పురస్కారాలను సైతం తిప్పి పంపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న నయన తార సెహెగల్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డును వెనక్కి పంపగా మరో కవి అశోక్‌ వాజ్‌పేయి కూడా అదే బాటను ఎంచుకున్నారు.

Pages

Subscribe to RSS - October