October

అనంతపురంలో మధు అరెస్ట్..

అనంతపురం జిల్లాలో సోలార్ హబ్ కోసం NTPC రైతుల వద్ద నుండి పదివేల ఎకరాలను  సేకరిస్తోంది. నష్ట పరిహారం అర్హులైన రైతులకు కాకుండా  బినామీలకు కట్టబెట్టేల అధికార పార్టీ నేతలు చక్రం తిప్పుతున్నారు.దీనిపై రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.వీరికి అండగా నిలబడిన సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధుని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసారు.. 

హోదాతోనే అభివృద్ధి:పాటూరు

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య పేర్కొన్నారు.కర్నూలులోని సిపిఎం జిల్లా కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ద్దేశించి పాటూరు మాట్లాడుతూ, రైతాంగం, శ్రమ జీవుల కష్టాలు, నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రత్యేక హోదా తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఉన్న ఉద్యోగాలు పోయాయన్నారు. విడిపోయే సందర్భంలోనే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కావాలని తాము కోరామని, ఈ విషయం గురించి ప్రధాని ఏమీ మాట్లాడడంలేదని చెప్పారు.

జగన్‌ దీక్షకు సంఘీభావం:CPM

 ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించే ప్రతిపక్షాలకు తమ మద్దతు ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తెలిపారు. జగన్‌ చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు.ప్రభుత్వం  ప్రత్యేక హోదా, ప్యాకేజీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. 

పోస్టులను భర్తీ చేయాలి:KVPS

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్య దర్శి అండ్య మాల్యాద్రి డిమాండ్‌ చేశారు. ప్రయి వేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ శాంతినగర్లో సోమవారం కెవిపిఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు దళిత, గిరిజన, మైనార్టీ ప్రజల సమస్యలు పూర్తిగా విస్మరించా యని విమర్శించారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు పాల్గొన్నారు.

SFI విద్యా పరిరక్షణ యాత్ర..

 ఏజెన్సీలో గిరిజన విద్యను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎంపీ, ఎపి గిరి జన సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ మిడియం బాబూరావు విమర్శించారు. గిరిజన విద్యను పరిరక్షించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు చేపట్టిన జీపుయాత్రను బాబూరావు మారేడుమిల్లిలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. దీంతో వారు రక్తహీనతతో చనిపోతున్నారని చెప్పారు. సౌకర్యాలు కల్పించ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శిం చారు. గురుకుల పాఠశాలల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు.

ముస్లింలకు12% రిజర్వేషన్లు ఇవ్వాలి

దేశంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాల్సిందేనని సిపిఎం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. మైనార్టీల రిజర్వేషన్ల అంశంపై హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. హక్కులు కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జస్టిస్‌ రాజేందర్‌ సచార్‌ కమిటీ, జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమీషన్‌లు సూచించిన విధంగా ముస్లింలను ఓబిసిిలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని గత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సిపిఎం ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నిర్బంధం

గత వారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ లోపలా వెలుపలా అట్టుడికిపోయింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ సభను వేడెక్కిస్తే- ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్దేశించిన చలో అసెంబ్లీపై అణచివేత బయిట నిరసనాగ్ని రగిల్చింది. ఒక విధంగా విభజనకు ముందు చలో అసెంబ్లీల సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఆత్మహత్యలు కూడా తెలుగు దేశం పాలన చివరి రోజులను మించిపోయే రీతిలో జరగడం ఆవేదనా కారణమైంది. గత విధానాలే అమలు జరుగుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని నాటి ఉద్యమ కారులే ప్రశ్నించిన పరిస్థితి ఏర్పడింది.

పోర్టు మాటున భూదందా!

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

Pages

Subscribe to RSS - October