October

కార్మిక వర్గ అంతర్జాతీయతకు డబ్ల్యుఎఫ్‌టియు కృషి

 పారిస్‌లో 1945 అక్టోబరు 3న స్థాపించ బడ్డ ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ టియు) దిగ్విజయంగా 70 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. కార్మిక వర్గ అంతర్జాతీయ తకు, ప్రపంచ కార్మికోద్యమ ఐక్యతకు కృషి చేస్తున్న వారు సాధించిన విజయం ఇది. రాజకీ య లేదా కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుం డా కార్మికవర్గ ప్రయోజనాల ఆధారంగా కార్మికులందరినీ ఒక తాటి మీదకు తేవటం డబ్ల్యుఎఫ్‌టియు విశిష్టత.

దేవాలయ భూముల నుంచి పేదలను తరిమేస్తున్న ప్రభుత్వం

 రాష్ట్రంలో వివిధ దేవాలయాల క్రింద మూడు లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలకు పనికొచ్చే భూములు కూడా ఉన్నాయి. ఈ భూములను కౌలుకు తీసుకొని వేలాది మంది పేదలు జీవనం సాగిస్తున్నారు. వీరు అసలు భూమిలేని నిరుపేదలు లేదా కొద్దిగా ఉన్న పేద రైతులు. దేవాలయ భూముల కౌలు రైతుల్లో అత్యధికులు బిసి, ఎస్‌సి ఎస్‌టి తరగతులకు చెందినవారే. ఒక వైపు పేదలు క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తూ సాగుచేసు కొంటుండగా మరోవైపు దేవాలయ భూములను ధనికులు ఆక్రమించుకొని కోర్టు లిటిగేషన్‌లో ఉన్నాయి. మరి కొందరు ధనికులు కౌలుకు తీసుకొని పేదలకు ఆ భూములకు అధిక కౌలుకు సబ్‌ లీజుకు ఇస్తున్నారు.

ICDS నిర్వీర్యానికి కుట్రలు..

''తిండి కలిగితె కండ కలదోరు-కండ కలవాడేను మనిషోరు'' అని చెప్పిన మహాకవి గురజాడ 153వ జయంతి ఇటీవల జరిగింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విధానాలు మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ లకు పౌష్టికాహార కల్పన, శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా 1975 అక్టోబర్‌ రెండున దేశంలో కేవలం 33 ప్రాజెక్టులతో ప్రారంభమైన ఐసిడిఎస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసు కొంది. నేడు 13.40 లక్షల అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా 10 కోట్ల మందికి పైగా సేవలంది స్తున్నది. ఇందులో 8.41 కోట్ల మంది ఆరేళ్ల లోపు పిల్లలు, 1.9 కోట్ల మంది గర్భిణీ, బాలింత స్త్రీలు.

మొసలి కన్నీరుతో కౌలు రైతులకు ఒరిగేదేంటి?

రైతు ఆత్మహత్యలపై ఎప్పుడూ స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల తెగ బాధపడుతూ మొసలి కన్నీరు బక్కెట్లు బక్కెట్లు కారుస్తున్నారు. అంతేగాక జరుగుతున్న వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో 70 శాతం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు చట్ట ప్రకారం ఇచ్చే విష యాన్ని నిర్దిష్టంగా చర్చించకుండా దాటవేశారు. సెప్టెంబరు నెలలోనే రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది పొగాకు రైతులు ఈ నెలలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత 15 నెలల్లో 164 మంది బలవన్మరణం పాలయ్యారు.

దుర్మార్గపు వ్యాఖ్యలు..

కార్మిక సంఘాలను, కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతిచ్చే పార్టీలను, సంస్థలను ఉక్కుపాదంతో అణచి వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపూరితమైనవి. రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి యాజమాన్యాల దోపిడీకి వకాల్తా పుచ్చుకోవడం దారుణం. ట్రేడ్‌ యూనియన్లపై విషం కక్కిన బాబు తమ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూలమని కుండబద్దలు కొట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు అడ్డంకిగా మారాయని స్వయంగా ముఖ్యమంత్రే వక్కాణించడం అక్కసును తెలుపుతుంది. యూనియన్లు పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయనడం వాక్‌చాపల్యమే.

అసహన ప్రతిరూపం..

ఒకానొక చారిత్రక సందర్భంలో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారడం ఎంతైనా ఆందోళనకరం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు సర్కార్లే నడుం కట్టడం అత్యంత ప్రమాదకరం. నిరసనోద్యమాలు, ప్రజాందోళనలపై చట్ట విరుద్ధమైన పద్ధతుల్లో మానవ హక్కుల హననం చేసి ఉక్కుపాదం మోపడం ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు అద్దం పడుతోంది.

రూ.4,417 కోట్ల నల్లధనం..

విదేశాలలో దాచిన నల్లధనం ఆస్తుల విలువ మరింతగా పెరిగింది. సెప్టెంబరు 30తో ముగిసిన '90 రోజుల నల్లధనం వెల్లడి పథకం'లో దాదాపు 638 మంది తమ నల్లధన ఆస్తుల విలువను వెల్లడించినట్లుగా రెవెన్యూ కార్యదర్శి హష్ముక్‌ ఆధియా సోమవారం తెలిపారు. వారు వెల్లడించిన మొత్తం అక్రమాస్తుల విలువ రూ.4,417 కోట్లకు చేరినట్లు ఆయన వివరించారు.

రాజధానిలో ప్రజా చైతన్యయాత్ర..

ప్రస్తుతం భూములు కోల్పోయి ఆందోళనలో ఉన్న రైతులకు భరోసాగా.. అండగా ఉండేందుకు సీపీఎం రాజధాని ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది. అమరావతి శంకుస్థాపనలోపే రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్మి పి.మధు డిమాండ్ చేసారు.ఈ యాత్ర ద్వారా 120 కిలోమీటర్లు 29 గ్రామాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రజల సంతోషాల మధ్య శంకుస్థాపనలు చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించలేదని బాధలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామలు నెరవేర్చడం లేదని, గత పది నెలల నుండి పని, ఉపాధి లేదని పేర్కొన్నారు. 

APకి ప్రత్యేకహోదా కోరుతూ నిరహార దీక్షలు..

 ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కర్నూలులో సీపీఎం రీలే నిరహార దీక్షలు చేపట్టింది. రాష్ర్ట విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చడం లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు  ఎంఏ గఫూర్ విమర్శించారు.  ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే ఈనెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నారని, లక్షలాది మంది వలసలు వెళ్లారన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క సమస్యలను పరిష్కరించడానికి లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని గఫూర్ డిమాండ్ చేశారు. 

CRDA కొత్త నిబంధనలు..

ప్రభుత్వ నిర్ణయాలు కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా ఉంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో లే అవుట్లు, ఇళ్ల నిర్మాణాల అనుమతులకు సిఆర్‌డిఎ విధిస్తున్న నిబంధనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సిఆర్‌డిఎ పరిధిలోని 58 మండలాల్లో అగ్రికల్చర్‌ ప్రొటక్షన్‌ జోన్‌ (గ్రీన్‌బెల్ట్‌)ను ఏర్పాటు చేసి ప్రస్తుతం గ్రామంలో ఇళ్లున్న ప్రాంతానికి 500 మీటర్లలోపు దూరంలోని లే అవుట్లకు మాత్రమే అనుమతి ఇస్తామని సిఆర్‌డిఎ చెబుతోంది. దీంతో గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతంలో రైతుల పొలాలకు విలువ తగ్గిపోతోంది.

Pages

Subscribe to RSS - October