November

సమైక్యతా సాధనంగా విద్య..

స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది. 1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10+2+3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు.

మోడీ వీసా రికార్డులు ఇవ్వాలి..

భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులను వచ్చే ఫిబ్రవరి నాటికి తమకు సమర్పించాలని అమెరికా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి విదేశాంగశాఖను ఆదేశించారు. 

రైతు ఉద్ధరణ ఇలాగా?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది పత్తి రైతుకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర. ఇంకేముంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశాం పంట తేవడమే ఆలస్యం అని సర్కారీ పెద్దలు ఆశ పెట్టడంతో నిజమేననుకొని పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లిన రైతులు కొనుగోలు జాడ లేక తెల్లబోతున్నారు. తిరిగి పంటను ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక దళారులకు అయిన కాడికి తెగనమ్ముకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులను రక్షించాల్సిన ప్రభుత్వమే వంచిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక గుండెలు అవిసేలా బోరుమంటున్నారు. రైతులంటే పాలకులకు ఎందుకంత అలుసో అర్థం కాదు.

అన్ని విధాలా ఆదుకోవాలి..

గోరుచుట్టుపై రోకటి పోటులా నిన్నటివరకు అనావృష్టితో బాధపడిన రాష్ట్ర్ర ప్రజలకు నేడు అతివృష్టి దెబ్బతీసింది. అల్పపీడనం ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ వర్షాలు ఆపార నష్టాన్ని కలిగించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఊరు యేరూ ఏకమయ్యాయి. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు కట్టలు తెంచుకు ప్రవహించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.

సామ్రాజ్యవాదపు వికృత శిశువు ఉగ్రవాదం..

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)..ఆ మధ్య జర్నలిస్టులకు నారింజ రంగు చొక్కాలు తొడిగి..ఏడారిలో కత్తులు ఝుళిపిస్తూ అతి క్రూరంగా గొంతుకలు తెగ్గోసి..ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో ఉంచి సంచలనం సృష్టించిన సాయుధ సంస్థ. 'మీ మిస్సైళ్లు మా మీద పడుతున్నంత కాలం..మా కత్తులు ఇలా గొంతులు కోస్తూనే ఉంటాయి' అని అమెరికా అధ్యక్షునికి హెచ్చరికలు పంపిన సంస్థ. ఇరాక్‌, సిరియాల తర్వాత జోర్డాన్‌, లెబనాన్‌లకు విస్తరించి, పాలస్థీనాను విముక్తం చేసి.. విస్త త ఖలీఫా రాజ్యం తెస్తామని, తర్వాత క్రమేపీ ప్రపంచమంతా ఖలీఫా రాజ్యం తేవాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది.

లోక్‌సభలో వామపక్షాల వాకౌట్‌..

 ఇటీవల కేంద్ర మంత్రి వీకే సింగ్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో బుధవారం దుమారం రేకెత్తించాయి. మంత్రి ఇటీవల జరిగిన ఒక దళితుని కుటుంబం సజీవ దహనం సంఘటనపై మాట్లాడుతూ, వారిని కుక్కలతో పోల్చడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు కురిపించాయి. ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ఇదే డిమాండ్‌తో తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇతర వామపక్షాలు కూడా సభనుంచి వాకౌట్‌ చేశాయి

గుజరాత్ లో బిజెపికి ఎదురుదెబ్బ

మొన్న యుపిలో నిన్న బీహార్‌లో వరుసగా దెబ్బ మీద దెబ్బ తింటున్న బిజెపికి తాజాగా గుజరాత్‌లో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపాల్టీల్లో గట్టెక్కినా కీలకమైన పంచాయతీల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బుధవారం వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో గ్రామీణ గుజరాత్‌లో కాంగ్రెస్‌ అత్యధిక పంచాయతీలను గెలుచుకుంది. అయితే మున్సిపల్‌ కార్పొరేషన్లలో మాత్రం బిజెపి తన పట్టును నిలుపుకుంది. మొత్తం ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లనూ అది చేజిక్కించుకుంది. జిల్లా, తాలుకా పంచాయితీల్లో మాత్రం కాంగ్రెస్‌ తన పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుచుకుంది. 

కార్మికవ్యతిరేక బిల్లు ఆమోదం

వివాదాస్పదమైన గుజరాత్‌ కార్మిక చట్టాల బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ప్రజా వినియోగ సేవల రంగాల్లో సమ్మెలను ఏడాదిపాటు నిషేధించే కార్మిక వ్యతిరేక నిబంధనలను గుజరాత్‌ ప్రభుత్వం ఈ బిల్లులో పొందుపరిచింది. గుజరాత్‌ తీవ్రవాద, సంఘటిత నేరాల నియంత్రణ (జిసిటిఓసి) బిల్లు, 2015ను కూడా దీనితో పాటే రాష్ట్రపతి వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని ప్రతిపక్షం నుండి విజ్ఞప్తులు రాష్ట్రపతికి అందాయి. హిందూ పత్రిక దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం ప్రకారం, సెప్టెంబరు 20నే గుజరాత్‌ కార్మిక చట్టాల (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు తేలింది. 

2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్..

ఎపి నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి లంక భూములను సేకరించడానికి సీఆర్డీఏ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2300 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు రైతులు 9.1 పత్రాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.

బాక్సైట్ శ్వేతపత్రం అసత్యాల పుట్ట..

గిరిజన గర్జనలో భాగంగా  నర్సీపట్నంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందకారత్  బాక్సైట్ తవ్వకాలపై  ప్రెస్మీట్ నిర్వహించారు.బాక్సైట్‌ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాల పుట్ట అని  విమర్శించారు. బాక్సైట్‌ తవ్వకాలతో వేలాది మంది గిరిజనులు నిరాశ్రయులై, జీవనోపాధి కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి పార్టీ తరపున ఆమె మద్దతు ప్రకటించారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంపెనీ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Pages

Subscribe to RSS - November