November

సిపిఎం పాదయాత్రలో సమస్యల వెల్లువ

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లు, మురుగు కాల్వలు, గృహ నిర్మాణాలను ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో నిర్మాణం చేపట్టి పూర్తిచేయాలని జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, యన్‌.కాళిదాసులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహిస్తున్న పాదయాత్ర మంగళవారం పెదనందిపాడు చేరింది. పాదయాత్రలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని రైతులు, ప్రజలు సాగునీరు, తాగునీరు లేక దశాబ్దాలుగా అల్లాడుతుంటే అధికారం సాధించిన ఆయా పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలతో కాలం గడవటమే గాని, సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వాలే లేవన్నారు.

రాజధాని హామీలన్నీ నీటిమూటలే

ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలాయని దీనికి ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నిదర్శనమని సిపిఎం రాజధాని కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజధానికి భూమి సమీకరణ క్రమంలో వ్యవసాయ కూలీలందరికీ రూ.2500లు పెన్షన్‌ అందిస్తామంటూ పేర్కొన్నారని, కానీ అందరికీ ఆయా పెన్షన్లు అందడంలేదని చెప్పారు. కేజీ టు పిజి ఉచిత విద్యను అమలుచేస్తానని చెప్పిన పాలకులు ఎక్కడ అమలుచేశారంటూ ప్రశ్నించారు. కేవలం మాటల గారడీ తప్పా ఆచరణలో కార్యాచరణ మాత్రం లేదన్నారు.

బేతపూడిలో పాతయాత్ర ప్రారంభం

సిపిఎం బాపట్ల డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పాదయాత్ర మంగళవారం బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో ప్రారంభమైంది. పాదయాత్రను సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఈ మని అప్పారావు ప్రారంభించారు. దళిత వాడలో శ్మశానానికి వెళ్లేందుకు దారి లేదని, గ్రామంలో అంతర్గత రోడ్ల సౌకర్యం లేదని పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. బేతపూడిలో లైబ్రరీ సెంటర్లో నివాసముంటున్న ప్రజలు గత కొన్నేళ్లుగా గ్రామకంఠానికిచెందిన భూమిలోనే ఇళ్ళు కట్టుకొని నివాసముంటున్నామని వాటికి ఇంతవరకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేయలేదని తెలిపారు.

సమస్యల వలయంలో శివారు కాలనీలు

నగరంలో పేదలు నివశించే కాలనీలలో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపియం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. ప్రజా సమస్యల అధ్యయనం, ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి వత్తిడి తెచ్చేందుకు సిపియం నగరంలో చేపట్టిన పాదయాత్ర మంగళవారానికి మూడోరోజుకు చేరుకుంది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పాదయాత్రలో పాశం రామారావు పాల్గొని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సమస్యలతో సతమతం

నగరంలో సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రెండో రోజుకు చేరుకున్నాయి.. నాయకులు వీధివీధికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అధికారులకు సమస్యలు అనేక సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని, అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ తమ కాలనీల్లో తొంగి చూడట్లేదని వారు పాదయాత్ర బృందం ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పారిశుధ్యం, రోడ్లు, మురుగు కాల్వలు, మంచినీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉపాధిని చూపి వలసలను అరికట్టాలి : సిపిఎం

గ్రామాల్లో వెంటనే కూలిపనులు లేని పేదలందరికీ ఉపాధి హామీ పనులు చూపించి వలసలను అరికట్టాలని సిపిఎం పార్టీ డివిజన్‌ కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఏడో రోజు సత్తెనపల్లి మండలంలోని కట్టావారిపాలెం, పెదమక్కెన, గుడిపూడి, నందిగం, భీమవరం గ్రామాల్లో సోమవారం పర్యటించింది. ఈ సందర్భంగా కూలీలు వ్యవసాయ పనులు లేకపోవడంతో పస్తులు ఉండాల్సి వస్తుందని, తమకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చూపించాలని గ్రామస్తులు పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. పెదమక్కెనలోని ఎస్సీకాలనీవాసులు రాజకీయ కక్ష్యతో దళితులకు ఉపాధిహామీ జాబ్‌కార్డులు ఇవ్వలేదన్నారు.

200 కుటుంబాలకు 40 ఏళ్లుగా స్థలాల్లేవు

రేపల్లె డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రలు రేపల్లెలో సోమవారం ప్రారంభమయ్యాయి. యాత్రను ఆ పార్టీ సీనియర్‌ నాయకులు బిఎల్‌కె.ప్రసాదు ప్రారంభించగా జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్‌ మాట్లాడారు. పట్టణంలో అనేక సమస్యలున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, ఒకటో వార్డు రెండో వార్డు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఇళ్లస్థలాలు, రేషన్‌ కార్డుల సమస్య అధికంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం 14 ఎకరాలను ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా నేటికీ పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. సిసి రోడ్లు, డ్రెయినేజీ, తాగునీరు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఒక్క ప్రభుత్వ కుళాయి కూడా లేదని అన్నారు.

బాబు పాలనలో ఎక్కడి సమస్యలక్కడే,- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పి.మధు నిశిత విమర్శ

రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఏ సమస్యా పరిష్కారం కాలేదని, ఎన్నికల వాగ్దానాలు నీటి మూటలుగానే మిగిలాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్రను గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిమ్మగడ్డ రామ్మోహనరావు నగర్‌లో ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రారంభ సభకు మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు, ఎం.పకీరయ్య అధ్యక్షత వహించారు. మధు మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన ప్రభుత్వం వారి నుంచి భూములను సమీకరించి ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మురికివాడల్లో సమస్యల తిష్ట సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల నగరంలో మురికివాడల్లో సమస్యలు తిష్ట వేశాయని, టిడిపి తన ఎన్నికల వాగ్దానాలు మరించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు విమర్శించారు. 24వ తేదీ వరకు నగరంలో సిపిఎం నిర్వహించే పాదయాత్రలు ఆదివారం సంగడిగుంట కమ్యూనిస్టు బొమ్మల సెంటర్‌ వద్ద ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభలో పాశం రామారావు మాట్లాడుతూ టిడిపి తన మ్యానిఫెస్టోలో పేదలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇస్తామని రెండున్నరేళ్ల పరిపాలనలో ఒక్క సెంటు కూడా పంపిణీ చేయలేదన్నారు. నగరంలో 35 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాల సమస్య ఉందన్నారు.

Pages

Subscribe to RSS - November