భట్టిప్రోలుకు కోట్లాడి రూపాయాలు తెచ్చామని చెబుతున్నా అభివృద్ధి జాడ మాత్రం లేదని సిపిఎం పాదయాత్ర బృందం పేర్కొంది. ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండల కేంద్రమైన భట్టిప్రోలుతోపాటు అద్దేపల్లి, అక్కివారిపాలెం, పెదపులివర్రు, గొరికపూడి, కోళ్లపాలెం, ఓలేరు గ్రామాల్లో సాగింది. శ్మశాన వాటికలు, నివేశనా స్థలాల సమస్యలు మరీ దుర్భరంగా ఉన్నాయని ఆయా గ్రామాల వారు పాదయాత్ర బృందం వద్ద వాపోయారు. భట్టిప్రోలు, అద్దేపల్లిలో మురుగునీటి పారుదలకు డ్రెయిన్ నిర్మాణం చేపట్టినా ఫలితం లేదని, మురుగునీరి రోడ్లపైకి వచ్చి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోయారు.