November

ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఛలోఅసెంబ్లీ

రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వామపక్షపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టాయి.  విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలుపుతున్న వామపక్ష, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు వందలాది మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు.ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ  రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడిన బిజెపి, టిడిపి నాయకులు అధికారంలోకి రావడంతోనే ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ..

మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకమైన శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతాన్ని అక్టోబరు విప్లవం నిరూపించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. రష్యన్ విప్లవం శత వార్షిక ఉత్సవాలను పురష్కరించుకుని సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉద్దరాజు రామం భవనంలో జరిగిన అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సీతారాం మట్లాడుతూ కార్మికవర్గం తొలి రాజ్యాధికారం అక్టోబర్ విప్లవం ద్వారా సాధ్యమైందన్నారు.

Pages

Subscribe to RSS - November