
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం ‘వ్యవస్థీకృతమైన, చట్టబద్ధమైన దోపిడీ’గా పేర్కొన్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విమర్శలు చేసింది. ‘మన్మోహన్ సింగ్‌ను అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరిగా పరిగణిస్తారు. కానీ యూపీఏ పదేళ్ల హయాంలో ఆయన ఏం చేశారు? కనీవినీ ఎరుగని వరుస కుంభకోణాలు, చూసి చూడని విధానాలతో ఎక్కువ నల్లధనం సృష్టి అప్పుడే జరిగింది. ఇది జాతి సంపదను వ్యవస్థీకృతంగా దోచుకోవడం కాదా అని’ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ జె.నందకుమార్ విమర్శించారు.