November

కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్‌తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు.

విదేశాలకు 2 లక్షల 76 వేల కోట్లు.!!

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా బ్లాక్‌ మనీ ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. గతంలో రూ. 96 వేల కోట్ల మేర విదేశాలకు తరలిపోతే.. ఈ ఏడాది రూ. 2 లక్షల 76 వేల కోట్లు బయటకు పోయిందని ఆయన అన్నారు. మోదీ అనుభవరాహిత్యమే దీనంతటికీ కారణమని ఉండవల్లి విమర్శించారు.

సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై..

పెద్ద నోట్లను రద్దు చేస్తూ మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై శివసేన మండిపడింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ సామాన్యులపై కాదని.. స్విస్ బ్యాంకుపై చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 

ఛానెళ్ల నవీకరణ నిబంధనల సడలింపు

టీవీ ఛానెళ్ల వార్షిక నవీకరణ నిబంధనలను సరళీకరించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు వెల్లడించారు. వారు నిర్ణీత గడువుకు 60 రోజుల ముందుగా వార్షిక అనుమతి రుసుము చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. దీనినే ఒక ఏడాది కాలపరిమితికి ప్రసారాల కొనసాగింపునకు అనుమతిగా పరిగణిస్తారన్నారు.

అవినీతి కేసుల్లో దర్యాప్తు ఆపొద్దు

అవినీతికి సంబంధించిన కేసుల్లో దర్యాప్తును అడ్డుకోరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పులిచ్చిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ‘ఓటుకు కోట్లు’కేసులో హైకోర్టుకు నివేదించారు. అవినీతి కేసులో దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఉందని, దాని అధికారాలను హరించే హక్కు ఈ కోర్టుకు లేదని వివరించారు.

ట్రంప్ విజయం..భారత్పై ఎఫెక్ట్..

గత ప్రభుత్వాలు తీసుకున్న అన్ని విదేశీ వాణిజ్య ఒప్పందాలను పునఃసమీక్షిస్తానని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తుడటంతో, భారత్తో ఉన్న ట్రేడ్ డీల్స్పై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. హెచ్1బీ వీసా ప్రొగ్రామ్ను ట్రంప్ ఎక్కువగా టార్గెట్ చేశారు. ఈ ప్రొగ్రామ్ను నిలిపివేస్తానని అమెరికన్లకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న భారత ఐటీ ఇండస్ట్రి భారీగా నష్టపోనుంది.

సంస్కరణలు కొనసాగిస్తాం :జైట్లీ

భారత ఆర్థిక వ్యవస్థలో తలుపులు మరింత బార్లా తెరవాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం కోసం, మౌలిక లోటును పూడ్చడం కోసం సంస్కరణలను మరో అడుగు ముందుకు వేయించనున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌-బ్రిటన్‌ టెక్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ఆర్థిక వృద్ధి విస్తృతమయ్యే కొద్దీ రక్షణాత్మక విధానాలను అవలంబించే వాళ్లు కూడా తగ్గిపోతారన్నారు..

 

పెద్దనోట్ల రద్దుపై హైకోర్టులో వ్యాజ్యం

కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కరెన్సీ నోట్లను రద్దు చేయడానికి వీలు కలిగిస్తున్న ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌తో పాటు దాని ఆధారంగా జారీచేసిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోరుతూ శ్రీనివాస్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బ్రిటీష్‌ కాలంలో ఏర్పడిన ఆర్‌బీఐ చట్టంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నిర్ణయం కొందరికి ముందే తెలుసునని.. దీనివల్ల సామాన్యులే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

మోదీది లెక్కలేనితనం : రాహుల్

రూ.500,1000 నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. సాధారణ ప్రజల పట్ల ప్రధాని మోదీది లెక్కలేనితనమని ఆయన విమర్శించారు. అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు, చిన్న దుకాణదారులు, గృహిణులు అష్టకష్టాలు పడుతున్నారని రాహుల్ పేర్కొన్నారు. 

Pages

Subscribe to RSS - November