June

భారత్‌ - చైనా

భారత్‌, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్‌ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.

రాజరికంపై గిరిజనుల తిరుగుబాటు బావుటా కామ్రేడ్‌ దశరథ దేవ్‌

                      సిపియం కేంద్రకమిటి సభ్యులు, త్రిపుర రాష్ట్ర మాజీముఖ్యమంత్రి దశరథ్‌దేవ్‌ శతజయంతి ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండవతేదీ నుండి ప్రారంభమైంది. ఫిబ్రవరి రెండవతేదీన అగర్తలాలోని రవీంద్ర శతవార్షిక భవన్‌లో జరిగిన సభలో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి, సిపియం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ దశరథ్‌దేవ్‌ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించారు. 'రాజా దశరథ్‌' అని గిరిజనులు ముద్దుగా పిలుచుకొనే దశరథ్‌ దేవ్‌ ఖోవారు సబ్‌డివిజన్‌లోని సుదూర గ్రామమైన అంపురాలో 1916 ఫిబ్రవరి రెండవ తేదీన పేదగిరిజన రైతు కుటుంబంలో జన్మించాడు.

Pages

Subscribe to RSS - June