June

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 

"అవినీతి -కార్పొరేట్ రాజకీయాలు - ఫ్రత్యామ్నాయం"

దేశ రాజకీయాలను అవినీతిమయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్‌ సంస్థల అధినేతల కాళ్లు రుద్దే పనిలో నేటి పాలకులు నిమగమయ్యారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. 'అవినీతి -కార్పొరేట్‌ రాజకీయాలు- ప్రత్యామ్నాయం' అనే అంశంపై సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సదస్సు జరిగింది. పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాఘవులు మాట్లాడుతూ రాజకీయాల్లోకి కార్పొరేట్‌ శక్తులు చొరబడిన తరువాత అవినీతికి అడ్డే లేకుండా పోయిందన్నారు. దీనిద్వారా చట్టసభల్లోకి వెళ్లి అక్కడ నుంచి వేల కోట్లు దోచుకోవడమేగాక సభలనూ నియంత్రిస్తున్నారని చెప్పారు.

'సివి సమగ్ర రచనలు - సమాలోచన'

కుల వ్యవస్థపై పోరాటానికి సివి రచనలు ఆయుధంగా ఉపయోపడతాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. విజయవాడలోని వేదిక కళ్యాణ మంటపంలో ఆదివారం సాహితీ, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యాన 'సివి సమగ్ర రచనలు - సమాలోచన' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అధ్యక్షత వహించారు. సమాలోచనలో భాగంగా 'కులం-వర్గం - సివి విశ్లేషణ' అంశంపై జరిగిన సమావేశంలో రాఘవులు మాట్లాడారు. సాంస్కృతిక విప్లవం అవసరమని సివి రచనలు మనకు చెబుతున్నాయన్నారు. సాంస్కృతిక ప్రతీఘాత విప్లవం సృష్టించడానికి బిజెపి, సంఫ్‌ు పరివార్‌లు ప్రయత్నిస్తున్నాయన్నారు.

అవినీతి రొచ్చులో బిజెపి

          'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' సామెత బిజెపికి బాగా నప్పుతుంది. పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్‌ అవినీతిని తూలనాడి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతిలో ఈత కొడుతున్నది. తొలి వసంత సంబరాలు జరుపుకుంటున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపికి, ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. మొన్న సుష్మా స్వరాజ్‌, నిన్న వసుంధరా రాజే, నేడు పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గిలగిల్లాడుతున్నారు.

ఆర్థిక మాంద్యం

             ఆర్థికపతనం మరోసారి సంభవించ నుందనే భయం ఆర్థికాభివృద్ధిని పెంపొందిం చాలంటే ప్రభుత్వాలు ద్రవ్య విధానపరమైన చొరవ తీసుకోవాలనే వాదనకు బలం చేకూరు స్తున్నది. కాని ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకోవటాన్ని ప్రపంచ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తన ప్రయోజనాలకు విఘాతం కలగనంత వరకే ప్రభుత్వాలు అప్పులు చేయటాన్ని ద్రవ్య పెట్టుబడి అనుమతిస్తుంది.

భారత్‌ - చైనా

          భారత్‌, చైనాల మధ్య అభివృద్ధిలో పోలికలు ఈనాటివి కావు. రెండు దేశాలూ రెండేళ్ల తేడాతో విముక్తి పొందడం, జనాభాలో, ఆర్థికాభివృద్ధిలో దాదాపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ పోలికలు నాటి నుండి నేటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్ర పూర్వం చైనా భారత కన్నా వెనుకబడి ఉండేది. సోషలిస్టు నిర్మాణం తరువాతా, 1980 దశకంలోనూ చైనా అప్రతిహత అభివృద్ధి సాధించడంతో భారత్‌ను అధిగమించి ముందుకు పోయింది. గత 20 ఏళ్లకు పైగా రెండంకెల అభివృద్ధితో నడుస్తున్న చైనా వేగం మందగించిందనీ, భారత్‌ వచ్చే ఏడాది అభివృద్ధిలో దాన్ని అధిగమిస్తుందనీ ఆర్థిక పండితులు, సంస్థలు చెబుతున్నాయి.

త్రిపురలో సిపియం విజ‌య కేత‌నం

త్రిపుర రాష్ట్రంలో జ‌రిగిన ఉప ఎన్ని‌క‌లో సిపియం రెండూ స్థా‌నాల్లో‌ను విజ‌యం సాధించింది. ఈ రెండు చోట్ల ప్ర‌తిప‌క్షాల‌కు డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. సుర్మ నియోజ‌క‌వ‌ర్గం నుండి అంజ‌న్ దాస్ 15,307 మోజార్టీ సాధించ‌గా,మ‌రో నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌తాప్ ఘ‌ర్ నుండి రామ్ దాస్ 17,326 మోజార్టీ ఓట్లు సాధించారు.

కేరళ అసెంబ్లీనుండి ఎల్‌డిఎఫ్‌ వాకౌట్‌

 తిరువనంతపురం: బార్‌ల లంచాలకు సంబంధించిన కేసులో ఆర్థిక మంత్రి కెఎం మణిని ప్రాసిక్యూట్‌ చేయరాదన్న విజిలెన్స్‌ నిర్ణయంపై ప్రతిపక్ష ఎల్‌డిఎఫ్‌ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని అనుమ తించనందుకు నిరసనగా ఎల్‌డిఎఫ్‌ సభ నుండి వాకౌట్‌చేసింది. ఈ నెల 27న జరిగిన అరువిక్కర ఉపఎన్నిక నేపథ్యంలో రిషెడ్యూల్‌ అయిన అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావే శాలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యా యి. సభ ప్రారంభమైన వెంటనే విజిలెన్స్‌ విభాగం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాయిదా తీర్మానం కోసం ఎల్‌డిఎఫ్‌ స్పీకర్‌కు నోటీసు అందచేసింది.

నిబద్ధతే సాహూ మహరాజ్‌ సామాజిక తత్వం

మహారాష్ట్ర సంస్థానాలన్నింటా బలవంతంగా ఆమోదింపక తప్పని ఉచ్ఛస్థితిలో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న రోజులవి. ఛత్రపతి శివాజీ వంశీయులు, ఘాట్గే వంశీయులైన జయంతిసింగ్‌ అబాసాహెబ్‌, రాధా బాయిలు సాహూ మహరాజ్‌ తల్లిదండ్రులు. వీరు క్షత్రియులా? కాదా? అన్న శీలపరీక్షకు గురిచేసింది ఆనాటి బ్రాహ్మణ వర్గం. సాహూ మహరాజ్‌ 1874 జూన్‌ 26న జన్మించారు. 1894లో తన ఇరవయ్యవ ఏట పాలనా బాధ్యతలు చేపట్టి ఎన్నో సామాజిక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ మనువాద తాత్వికతను క్షుణ్ణంగా పరిశీలించారు. అవరోధంగా ఉన్న వాటిని వదిలి ప్రజల సానుకూల అంశాలను పాలనా వ్యవస్థలో ఇమిడ్చారు.

Pages

Subscribe to RSS - June