మా బంధువు ఒకరు ఛాతిలో మంట ఉందని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళారు. వెంటనే ఎండోస్కోపీ, రక్తపరీక్షలు చేస్తేనే జబ్బు ఏంటో తెలుస్తుందని భయపెట్టి డాక్టర్ అన్ని రకాల పరీక్షలూ చేశారు. 15 రోజులకు రూ.2,200 విలువ చేసే మందులు సహా రూ.7,500 వసూలు చేశారు. అదే వ్యక్తిని కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే గ్యాస్ సమస్య ఉందని, కారం, మసాలాలు తగ్గించమని చెప్పి ఒక ట్యాబ్లెట్‌తోపాటు, మంట ఉన్నప్పుడు డైజిన్ మాత్ర చప్పరిస్తే సరిపోతుందని చెప్పారు. దీనికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చయింది. మన రాష్ట్రంలో ప్రజలను ప్రైవేట్ వైద్యశాలలు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో అర్థమవుతుంది.